Udhayanidhi Stalin Nayakudu will be stream in netflix from next week
Nayakudu : తమిళ నటుడు మరియు రాజకీయనేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) హీరోగా తెరకెక్కిన రీసెంట్ సూపర్ హిట్ మూవీ ‘మామన్నన్’ (Maamannan). ఈ మూవీతో ఉదయనిధి సినిమాల్లో నటించడం మానేస్తాను అని ప్రకటించడంతో.. ఈ మూవీ పై ఆడియన్స్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ చిత్రానికి ప్రముఖ తమిళ డైరెక్టర్ మరి సెల్వరాజ్ దర్శకత్వం వహించడం సినిమా పై మరింత ఆసక్తిని కలుగజేసింది. సెల్వరాజ్ సినిమాలు అన్ని వాస్తవ కథలకి దగ్గరగా ఉంటాయి.
Baby Movie : ఫస్ట్ డే కంటే నాలుగో రోజు కలెక్షన్స్ ఎక్కువ సాధించిన బేబీ.. ఎంతో తెలుసా..?
ఈ డైరెక్టర్ తెరకెక్కించిన ‘పరియారుమ్ పెరుమాళ్’, ‘కర్ణన్’ వంటి సినిమాలు తెలుగు ఆడియన్స్ ని కూడా అలరించాయి. ఇక తమిళనాట జూన్ 29న రిలీజ్ అయిన ‘మామన్నన్’ మూవీ సూపర్ హిట్ అయ్యింది. పొలిటికల్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ 50 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకోవడంతో మూవీని తెలుగులో ‘నాయకుడు’ ((Nayakudu)) పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని జూలై 14న రిలీజ్ చేయగా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.
VADIVELU, UDHAYANIDHI, FAHADH, KEERTHY, MARI SELVARAJ AND AR RAHMAN TOGETHER!! We’re seeing stars?#Maamannan, coming to Netflix on the 27th of July!?#MaamannanOnNetflix pic.twitter.com/Fl8ulKvdID
— Netflix India South (@Netflix_INSouth) July 18, 2023
అయితే రిలీజ్ అయ్యి రెండు వారలు కూడా కాకముందే ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటీటీ లోకి తీసుకు వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. జూలై 27 నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో ప్రసారం కానుంది. తమిళ్ తో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఈ మూవీ అందుబాటులో ఉండనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. కాగా ఈ సినిమాలో తమిళ్ స్టార్ కమెడియన్ వడివేలు (Vadivelu), ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil), కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రలు పోషించారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.