మహర్షి సినిమాలో రైతు పాత్రలో అద్భుతంగా నటించిన గురుస్వామి గురించి ఆశ్చర్యపరచే విషయాలు తెలిసాయి..
సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో రూపొందిన మహర్షి.. మే 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అన్నిచోట్లా పాజిటివ్ టాక్‌తో, హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది మహర్షి. సినిమాలో రైతుల సమస్యలు, వాటి పరిష్కారాలు వివరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. మహర్షి సెకండ్ హాఫ్ అంతా రామవరం అనే విలేజ్‌లో జరుగుతుంది. కార్పొరేట్ సంస్థ ఇళ్ళు కూల్చేసి, ఉళ్ళు ఖాళీ చేయిస్తున్నా, ఒక పెద్దాయన మాత్రం అవేవీ పట్టించుకోకుండా తనపొలంలో ఒక్కడే వ్యవసాయం చేస్తుంటాడు.
‘ఇక్కడే పుట్టా, ఈ మట్టిలోనే చస్తా, ఎవడైనా ఈ పొలం నాదని వస్తే ఊరుకోను’, ‘ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదంటారు.. మరి రైతు ఏడిస్తే దేశానికి ఏం మంచి జరుగుతుంది’.. అంటూ ఈ పెద్దాయన చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇంతకుముందు ఏ సినిమాలోనూ చూడలేదు, ఎవరీయన అంటే, ఆయన గురించి ఆసక్తి కరమైన విషయాలు తెలిసాయి.
ఆ పెద్దాయన పేరు గురుస్వామి, ఊరు కర్నూలు.. ఆయన స్టేజ్ ఆర్టిస్ట్.. ఇప్పటి వరకు చాలా నాటకాలు వేసారు. బీఎస్ఎన్ఎల్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. గురుస్వామి నటించిన ఒక షార్ట్ ఫిలిం చూసి, ఆయనకి మహర్షిలో అవకాశం ఇచ్చారు. తన అనుభవంతో మహర్షిలో రైతు పాత్రలో చాలాబాగా నటించారాయన. ఇప్పటినుండి టాలీవుడ్‌లో ఆయనకి మరికొన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.