Unstoppable Season 3 : షూటింగ్ కూడా అయిపోయింది.. అన్‌స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ వచ్చేది ఆ రోజే..

ఆహా ఓటీటీ బాలయ్య బాబుతో అన్‌స్టాపబుల్ సీజన్ 3 ప్రకటించిన దగ్గర్నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఈ షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Unstoppable with NBK Season 3 First Episode with Bhagavanth Kesari Movie Team Streaming Date announced

Unstoppable Season 3 : ఆహాలో(Aha) బాలకృష్ణ(Balakrishna) హోస్ట్ గా చేసిన అన్‌స్టాపబుల్ టాక్ షో సీజన్ 1, సీజన్ 2 రెండూ 20 ఎపిసోడ్స్ ఎంత సూపర్ హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. అన్‌స్టాపబుల్ విత్ NBK సరికొత్త రికార్డులని సృష్టించడమే కాక బాలయ్య బాబులోని ఇంకో కోణాన్ని చూపిస్తూ బోలెడంత మంది స్టార్స్ ని తీసుకొచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఇప్పటికే రెండు సీజన్స్ లో చాలా మంది హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్, నిర్మాతలు రాగా ఇప్పుడు సీజన్ 3 కూడా రాబోతుంది.

ఆహా ఓటీటీ బాలయ్య బాబుతో అన్‌స్టాపబుల్ సీజన్ 3 ప్రకటించిన దగ్గర్నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఈ షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దసరా ముందే ఫస్ట్ ఎపిసోడ్ ఉండనున్నట్టు, మొదటి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీం కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, అనిల్ రావిపూడి అన్‌స్టాపబుల్ సీజన్ 3 షోలో రానున్నట్టు కూడా ఆహా ప్రకటించింది.

Also Read : Bigg Boss 7 Day 38 : వచ్చిన కెప్టెన్సీని వాడుకోలేకపోయాడు.. శివాజీ కూడా ప్రశాంత్ పై ఫైర్ అయ్యాడు..

తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ షూటింగ్ అయిపోయింది. షూటింగ్ లో పాల్గొన్న భగవంత్ కేసరి టీం ఫొటోలను ఆహా రిలీజ్ చేసింది. ఇక ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించేసింది ఆహా. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 3లో మొదటి ఎపిసోడ్ కి భగవంత్ కేసరి టీం రాగా ఈ ఫస్ట్ ఎపిసోడ్ దసరా ముందు అక్టోబర్ 17న రిలీజ్ కానుంది. దీంతో బాలయ్య అభిమానులు ఆతృతగా ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు.