Upasana : డెలివరీ కోసం హాస్పిటల్‌కి చేరుకున్న ఉపాసన.. రేపే మెగా వారసత్వం ఎంట్రీ..
ఉపాసనకు రేపే డెలివరీ జరగనుంది. దీంతో ఉపాసన, చరణ్ హాస్పిటల్ కి చేరుకున్నారు.
- gum 95921
- Updated on- June 30, 2023 / 04:19 PM IST
Upasana arrived hospital to her delivery with ram charan
Ram Charan – Upasana : రామ్ చరణ్, ఉపాసన (Upasana) తమ మొదటి బేబీని ఆహ్వానించబోతున్న సంగతి తెలిసిందే. తమ పెళ్ళైన పదేళ్ల తరువాత తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఈ జంట ప్రకటించడంతో.. మెగా కుటుంబం మరియు అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దీంతో ఆ మెగా వారసత్వం ఎంట్రీ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక డెలవిరీ డేట్ దగ్గర పడుతుండడంతో రామ్ చరణ్ కూడా కొన్ని రోజులు నుంచి షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చేసి ఉపాసనతోనే ఉంటూ వస్తున్నాడు.
Ram Charan : రామ్ చరణ్‌కి పుట్టబోయే బిడ్డ కోసం కీరవాణి కొడుకు స్పెషల్ ట్యూన్.. ఉపాసన ట్వీట్!
తాజాగా ఉపాసన డెలివరీ కోసం హాస్పిటల్ కి చేరుకుంది. ఆమె వెంట రామ్ చరణ్, సురేఖ (చిరంజీవి సతీమణి) కూడా హాస్పిటల్ కి చేరుకున్నారు. రేపు (జూన్ 20) ఆమెకు డెలివరీ చేయనున్నారు. ఈ డెలివరీ కోసం ఫారిన్ నుంచి డాక్టర్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇక రేపు జూనియర్ చిరుత ఇస్తున్నాడు అని తెలియడంతో సోషల్ మీడియాలో మెగా అభిమానులు సందడి చేస్తున్నారు.
The Mega couple reach the hospital as @upasanakonidela is expected to deliver the first child with @AlwaysRamCharan tomorrow ?#RamCharan #Upasana #GlobalStarRamCharan #GameChanger pic.twitter.com/WhGrc8qA0u
— SivaCherry (@sivacherry9) June 19, 2023
ఇక కొన్ని రోజులు నుంచి షూటింగ్స్ గ్యాప్ ఇచ్చిన చరణ్.. డెలివరీ తరువాత కూడా ఆగష్టు వరకు షూటింగ్స్ లో పాల్గొనడని తెలుస్తుంది. పుట్టబోయే బిడ్డతోనే కొన్ని రోజులు గడపాలని చరణ్ భావిస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చెంజర్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే బిడ్డ పుట్టిన తరువాత చరణ్ అండ్ ఉపాసన.. చిరంజీవి ఇంటికి షిఫ్ట్ అవ్వనున్నారు. గ్రాండ్ పేరెంట్స్ అయిన చిరంజీవి అండ్ సురేఖ సంరక్షణలోనే తమ బిడ్డని పెంచాలని భావిస్తున్నట్లు ఇటీవల ఉపాసన ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.
