Dr. Prathap C Reddy : తన తాతయ్య బయోపిక్ తీస్తానంటున్న ఉపాసన..

తాజాగా నిన్న ఉపాసన తాతయ్య 91వ పుట్టిన రోజు సందర్భంగా 'ది అపోలో స్టోరీ'(The Apollo Story) అనే పుస్తకాన్ని లాంచ్ చేశారు.

Upasana Launched The Apollo Story Book on her Grand Father Dr Prathap C Reddy 91st Birthday and says ready to do his Biopic

Dr. Prathap C Reddy : ఉపాసన(Upasana) తాతయ్య డా. ప్రతాప్ చంద్ర రెడ్డి గురించి అందరికి తెలిసిందే. అపోలో(Apollo) హాస్పిటల్స్ ఫౌండర్ గా దేశ విదేశాల్లో అపోలో సేవలని విస్తరించి హెల్త్ కేర్ రంగంలో అరుదైన ఖ్యాతి గడించారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఉపాసన తన స్ఫూర్తి తాతయ్య అని చాలా సార్లు చెప్పింది. ఉపాసన కూడా ప్రస్తుతం అపోలో భాద్యతలు చూసుకుంటుంది. తాజాగా నిన్న ఉపాసన తాతయ్య 91వ పుట్టిన రోజు సందర్భంగా ‘ది అపోలో స్టోరీ'(The Apollo Story) అనే పుస్తకాన్ని లాంచ్ చేశారు.

ప్రతాప్ రెడ్డి, అపోలో హాస్పిటల్స్ చరిత్ర, అవి ఎదిగిన విధానం, ఎదుర్కున్న సవాళ్లు.. ఇలా అనేక అంశాలతో రాసిన పుస్తకం ‘ది అపోలో స్టోరీ’. నిన్న ప్రతాప్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో ఈ పుస్తకాన్ని లాంచ్ చేశారు. అనంతరం ఉపాసన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తన తాతయ్య గురించి, అపోలో గురించి, తన తాతయ్య తన కూతుళ్లలో ఎలా స్ఫూర్తి నింపారు అని మాట్లాడింది. ఈ పుస్తకాన్ని ప్రతి తండ్రి చదవాలని, ఈ బుక్ చదివి ప్రతి మహిళ స్ఫూర్తి పొందాలని అన్నారు.

Also Read : Lavanya Tripathi : మెగా ఫ్యాన్స్ తనని ‘వదిన’ అని పిలవడంపై.. లావణ్య రియాక్షన్ ఏంటో తెలుసా..?

ఈ ప్రెస్ మీట్ లో పుస్తకం తీసుకొచ్చారు, బయోపిక్ ఏమైనా చేసే ఆలోచన ఉందా అని మీడియా అడగ్గా.. అవును, భవిష్యత్తులో అది జరగొచ్చు అని తెలిపింది. రామ్ చరణ్ అందులో నటిస్తాడా అని అడగ్గా.. అది డైరెక్టర్ విజన్ బట్టి ఉంటుందని తెలిపింది. దీంతో ఉపాసన తాతయ్య, అపోలో ఫౌండర్ డా. ప్రతాప్ చంద్ర రెడ్డి బయోపిక్ కూడా భవిష్యత్తులో రాబోతుందని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు