Site icon 10TV Telugu

Upasana : పెళ్లి తర్వాత ఇంట్లో అలా తింటుంటే అందరూ నన్నే చూసారు.. అప్పట్నుంచి మామయ్య చెప్పింది ఫాలో అవుతున్నా..

Upasana Tells Interesting Thing Regarding Food Guided by Chiranjeevi

Upasana

Upasana : మెగా కోడలు ఉపాసన రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ సంబంధించిన పోస్టులను షేర్ హిస్తూ ఉంటుంది. ఉపాసన వ్యాపారవేత్తగా దూసుకుపోతుంది. మరోవైపు క్లిన్ కారాకు అమ్మగా బాధ్యతలు నిర్వహిస్తుంది. తాజాగా ఉపాసన ఓ బాలీవుడ్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Also Read : NTR – Nagavamsi : ఆ విమర్శలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చిన ఎన్టీఆర్, నాగవంశీ.. వార్ 2 బాలీవుడ్ సినిమా కాదు అని నొక్కి మరీ చెప్పడంతో..

ఈ ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ.. సాధారణంగా అందరూ పెరుగు లాస్ట్ లో తింటారు. నేను పెళ్లి తర్వాత ఈ ఇంటికి వచ్చాక ఫస్ట్ టైం లంచ్ లో అందరూ కూర్చొని తింటున్నప్పుడు నేను ఫస్ట్ పెరుగు వేసుకొని తినడం మొదలు పెట్టాను. అందరూ నన్ను అలాగే చూసారు. అసలు అలా ఎలా తినగలుగుతున్నావు అని అడిగారు. ముందు పప్పు, కర్రీ, పచ్చడి, తర్వాత రసం, లాస్ట్ కి పెరుగు తినాలి. అదే అలవాటు చేసుకున్నా. అలా తినడం హెల్త్ కి కూడా మంచిది. మా మామయ్య పెరుగు లాస్ట్ కి తినాలి అని చెప్పారు. అప్పట్నుంచి నేను మా మామయ్య చెప్పింది ఫాలో అవుతున్నాను అని తెలిపింది.

Also Read : Upasana : సద్గురు మా అమ్మాయికి డైలీ ఆ ఫుడ్ పెట్టామన్నారు.. క్లిన్ కారా డైలీ ఇది కచ్చితంగా తింటుందట..

Exit mobile version