Upasana : అత్తామామల గురించి ఉపాసన ఏం చెప్పిందంటే? సురేఖ ఇచ్చిన సలహా ఇదే.. ఆ విషయంలో చిరు, ఉపాసన ఒకటే..

ఉపాసన తన అత్తమామలు చిరంజీవి - సురేఖ గురించి కూడా మాట్లాడింది.

Upasana

Upasana : మెగా కోడలి గానే కాకుండా ఉపాసన వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అమ్మగా క్లిన్ కారాతో కూడా బిజీగా ఉంది. ఉపాసన రెగ్యులర్ గా సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఉపాసన ఓ బాలీవుడ్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఉపాసన అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది.

ఈ క్రమంలో ఉపాసన తన అత్తమామలు చిరంజీవి – సురేఖ గురించి కూడా మాట్లాడింది.

Also Read : Upasana : సద్గురు మా అమ్మాయికి డైలీ ఆ ఫుడ్ పెట్టామన్నారు.. క్లిన్ కారా డైలీ ఇది కచ్చితంగా తింటుందట..

ఉపాసన మాట్లాడుతూ.. మా మామయ్యకు నేను పెళ్ళికి ముందే తెలుసు. ట్రెడిషినల్ గర్ల్ కాదు కానీ డిఫరెంట్ గర్ల్ అని అంటారు. ఆయన నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. నా అత్తమామలు ఇద్దరూ నాకు సపోర్ట్ చేస్తారు. వాళ్లంటే నాకు గౌరవం. సపోర్ట్ చేసే వాళ్ళు ఉండటం ఇంపార్టెంట్. మా అత్తమ్మ పెళ్ళికి ముందు ఒకటే సలహా ఇచ్చింది. నేను చేసుకోబోయేది మూవీ స్టార్ ని కాబట్టి.. వాళ్ళ గురించి ఎవరు ఎలాంటి రూమర్స్ చెప్పినా, ఎవరు ఏం చెప్పినా నమ్మకు. సినిమా ఆర్టిస్ట్ ని పెళ్లి చేసుకొని డీల్ చేయడం కష్టం అని తెలిపింది. చరణ్ ని ఎలా డీల్ చేయాలో మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అత్తమ్మకు మా మామయ్యని డీల్ చేసిన అనుభవం ఉంది కాబట్టి అని తెలిపింది.

అలాగే..నేను, మామయ్య ఫోటోలు తీసుకోడానికి ఇష్టపడతాము. ఇంట్లో ఎవరికీ ఫొటోలు ఇష్టం ఉండదు. నాకు ఫోటోలు తీసుకోవడం ఇష్టం. సెల్ఫీలు తీసుకుందాం అంటే రారు. ఇంట్లో వాళ్ళను ఫొటోలకు ఒప్పించడం చాలా కష్టం. ఈ విషయంలో నేను మామయ్య ఒకటే అని తెలిపింది ఉపాసన.

Also Read : Upasana : పెళ్లి తర్వాత ఇంట్లో అలా తింటుంటే అందరూ నన్నే చూసారు.. అప్పట్నుంచి మామయ్య చెప్పింది ఫాలో అవుతున్నా..