Upcoming Telugu Movies: కరోనా వచ్చి సినిమాల రిలీజ్‌లకి అడ్డం పడిపోయింది. సరే.. మా సినిమాలు రిలీజ్ చేసుకోవాలని గోల పెడుతుంటే.. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఇచ్చింది.
కానీ కోవిడ్‌కి భయపడి జనాలు థియేటర్‌కి వెళ్లే ధైర్యం చెయ్యడం లేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సాహసం చేస్తున్నాడు. నా సినిమా Next Month రిలీజ్ చేస్తున్నా అంటూ అనౌన్స్ చేశాడు.
పర్మిషన్లు వచ్చినా.. జనాలు రారేమోనన్న అనుమానంతో థియేటర్లు ఓపెన్ చెయ్యడానికి భయపడుతున్నారు యజమానులు. మరోవైపు కోవిడ్ భయంతో జనాలు కూడా రావడానికి భయపడుతున్నారు.
ఇలాంటి సిచ్యువేషన్స్‌లో సాయి ధరమ్ తేజ్ సాహసం చేస్తున్నాడు. అసలు ఇలాంటి క్రిటికల్ టైమ్‌లో రిస్క్ తీసుకుని సినిమా రిలీజ్ చెయ్యడానిక ఎంత ధైర్యం ఉండాలి అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.
సాయి ధరమ్ తేజ్ హీరోగా సుబ్బు డైరెక్షన్లో, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించి సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’.. మే లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా పోస్ట్ పోన్ అయ్యింది. అయితే లేటెస్ట్‌గా ఈ సినిమాని డిసెంబర్‌లో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం అంటూ అనౌన్స్ చేశారు టీమ్.
తేజు సినిమా కంటే ముందే రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఇప్పటి వరకూ అసలు రిలీజ్ మీద ఎటువంటి కన్‌ఫర్మేషన్ ఇవ్వకుండా కామ్‌గా ఉన్నారు. కానీ సాయి ధరమ్ మాత్రం డేర్ చేస్తున్నాడు. డిసెంబర్‌లో క్రిస్మస్, న్యూ ఇయర్ కానుకగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు టీమ్.
మెగా మేనల్లుడితో పాటు మిగతా సినిమాలు కూడా థియేటర్లలోకి రావడానికి ఎదురు చూస్తున్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రెడీ ఫర్ రిలీజ్ అంటోంది. ఈ సినిమాని కూడా డిసెంబర్‌లోనే రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి కావొచ్చింది. 2021 సంక్రాతికి విడుదల చేద్దామనుకున్నారు కానీ ఇంకా కన్‌ఫర్మ్ చెయ్యలేదు. ఇక రామ్ ‘రెడ్’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలు కూడా ఎప్పటి నుంచో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఈ సినిమాలు కూడా సంక్రాంతికే రిలీజ్ అవ్వబోతున్నాయి.
ఇక రీసెంట్‌గా షూట్ కంప్లీట్ చేసుకున్న రవితేజ ‘క్రాక్’, నితిన్- కీర్తి సురేష్ జంటగా తెరెకెక్కుతున్న ‘రంగ్ దే’, సందీప్ కిషన్ స్పోర్ట్స్ మూవీ ‘A1 ఎక్స్‌ప్రెస్’ సినిమాలు కూడా సంక్రాంతికే ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇలా రిలీజ్‌కు ఇప్పటికే లేట్ అయిపోయిందని ఎప్పుడెప్పుడు ఆడియన్స్ ముందుకు వద్దామా అని ఉవ్విళ్లూరుతున్నాయి మన తెలుగు సినిమాలు.