Zombie Reddy 2 : జాంబీ రెడ్డి 2 నుంచి ఉపేంద్ర ఫ‌స్ట్ లుక్‌..

జాంబీ రెడ్డి 2 మూవీ (Zombie Reddy 2) నుంచి ఉపేంద్ర ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.

Upendra first look from Zombie Reddy 2 Movie

Zombie Reddy 2 : తేజ స‌జ్జా, ప్ర‌శాంత్ వ‌ర్మ కాంబినేష‌న్ తెర‌కెక్కిన జాంబీ రెడ్డి చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సుప‌ర్ణ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో జాంబీ రెడ్డి 2 రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో తేజ స‌జ్జ‌కు జోడీగా బాలీవుడ్ న‌టి ష‌నాయా క‌పూర్ న‌టిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్ పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో స్టార్ న‌టుడు ఉపేంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. నేడు ఆయ‌న పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నకు బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేస్తూ.. ఈ చిత్రంలోని ఆయ‌న ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. చెట్టు పై రివ‌ర్స్‌లో గ‌న్ ప‌ట్టుకుని ఉన్న ఉపేంద్ర లుక్ అదిరిపోయింది.

You Tuber Viraajita : సముద్ర‌పు హోరుగాలిలో యూట్యూబర్ విరాజిత.. ఫోటోలు వైర‌ల్‌..