Urvashi Rautela : అఖిల్ గురించి అలా అన్నందుకు లీగల్ నోటీసులు పంపిన ఊర్వశి రౌతేలా..

ఇటీవల ఉమైర్ సంధు ఓ ట్వీట్ లో.. ఏజెంట్ సినిమా ఐటెం సాంగ్ షూట్ సమయంలో అఖిల్.. ఊర్వశిని ఏడిపించాడని, ఆమెతో మిస్ బిహేవ్ చేశాడని, ఊర్వశి కూడా అతనితో వర్క్ చేయడం నచ్చలేదని, అతను ఇబ్బంది పెట్టాడని చెప్పినట్లు ట్వీట్ చేశాడు.

Urvashi Rautela send legal notices to Umair Sandhu for fake news spreading

Urvashi Rautela :  హీరో, హీరోయిన్స్, సెలబ్రిటీల మీద పుకార్లు, అక్కర్లేని వార్తలు, తప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. సెలబ్రిటీలు కొంతమంది వాటిని సీరియస్ గా తీసుకొని రియాక్ట్ అవుతుంటే మరికొంతమంది మాత్రం అసలు వాటిని పట్టించుకోరు. తాజాగా బాలీవుడ్(Bollywood) భామ ఊర్వశి రౌతేలా(Urvashi Rauteka) తనపై, హీరో అఖిల్(Akhil) పై తప్పుడు వార్తలు రాసిన ఓ సినీ క్రిటిక్ కి లీగల్ నోటీసులు పంపించింది.

బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ప్రస్తుతం తెలుగులో ఐటెం సాంగ్స్ తో బిజీ అవుతుంది. ఇటీవల వాల్తేరు వీరయ్యలో చిరంజీవి సరసన స్పెషల్ సాంగ్ చేసిన ఊర్వశి త్వరలో రానున్న అఖిల్ ఏజెంట్ సినిమాలో కూడా ఓ ఐటెం సాంగ్ చేసింది. మరోసారి ఊర్వశి తెలుగు ప్రేక్షకులని తన డ్యాన్స్, అందంతో మెప్పించనుంది. అమెరికాలో ఉండి ఇండియన్ సినిమాల గురించి రాసే సినీ క్రిటిక్ ఉమైర్ సంధు రెగ్యులర్ గా వివాదం అయ్యే ట్వీట్స్ చేస్తూ ఉంటాడట. పలువురు బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ గురించి తప్పుడు వార్తలు రాస్తూ ఉంటాడు.

ఇటీవల ఉమైర్ సంధు ఓ ట్వీట్ లో.. ఏజెంట్ సినిమా ఐటెం సాంగ్ షూట్ సమయంలో అఖిల్.. ఊర్వశిని ఏడిపించాడని, ఆమెతో మిస్ బిహేవ్ చేశాడని, ఊర్వశి కూడా అతనితో వర్క్ చేయడం నచ్చలేదని, అతను ఇబ్బంది పెట్టాడని చెప్పినట్లు ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది. ఈ ట్వీట్ ఊర్వశి దృష్టికి వెళ్లడంతో దీనిపై ఊర్వశి రౌతేలా సీరియస్ అయి ఉమైర్ సంధుకి లీగల్ నోటీసులు పంపించింది.

Pooja Hegde : పాపం పూజా.. త్రివిక్రమ్ అయినా ఆదుకుంటాడా?

అంతేకాక దీనిపై తన సోషల్ మీడియాలో ఊర్వశి రౌతేలా.. ఇతనికి లీగల్ నోటీసులు పంపిస్తున్నాను నా లీగల్ టీం తరపున. నువ్వేం నా స్పోక్ పర్సన్ వి కాదు నా గురించి మాట్లాడటానికి. నువ్వే మెచ్యూరిటీ లేని ఓ జర్నలిస్ట్ వి. నేను, నా ఫ్యామిలీ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేలా నువ్వు చేస్తున్నావు అంటూ పోస్ట్ చేసింది. దీంతో అటు ఊర్వశి అభిమానులు, ఇటు అఖిల్ అభిమానులు కూడా ఉమైర్ సంధు పై ఫైర్ అవుతున్నారు.