ఏపీ సీఎం జగన్‌ను కలిసిన వినయ్
ఏపీ సీఎం జగన్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు..

ఏపీ సీఎం జగన్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు..
ఏపీ సీఎం జగన్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ బుధవారం (నవంబర్ 6) కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన వినాయక్.. జగన్ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
జగన్ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత తొలిసారిగా కలిసిన వినాయక్.. శాలువ కప్పి ఆయన్ను సత్కరించారు. అయితే వి.వి.వినాయక్ వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన జగన్‌తో భేటీ కావడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చకు తెరతీసింది.
Read Also : అమితాబ్ 50 ఇయర్స్ ఇండస్ట్రీ – అభిషేక్ ఎమోషనల్ పోస్ట్
వినాయక్ వెంట ఆయన స్నేహితుడు నిర్మాత నల్లమలుపు బుజ్జి, ఫైనాన్సియర్ సాధక్ కూడా ఉన్నారు. కాగా వి.వి.వినాయక్ హీరోగా ‘శీనయ్య’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు నరసింహా తెరకెక్కిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది..