Site icon 10TV Telugu

Vaishnav Tej : కళ్యాణ్ మామయ్య ‘బద్రి’ సినిమా రీమేక్‌లో నటించాలనుంది..

Vaishnav Tej wants to remake Pawan Kalyan Badri Movie

Vaishnav Tej wants to remake Pawan Kalyan Badri Movie

Vaishnav Tej :  ఉప్పెన సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత రెండో సినిమా కొండపొలంతో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు కేతికశర్మతో కలిసి రంగరంగ వైభవంగా అంటూ వస్తున్నాడు. నేడు సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా వైష్ణవ్, కేతిక జంటగా గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన రంగరంగ వైభవంగా సినిమా విడుదల కానుంది.

దీంతో గత కొన్ని రోజులుగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరో వైష్ణవ్ తన మామయ్య సినిమాలో ఓ సినిమాని రీమేక్ చేయాలని ఉంది అన్నాడు. సాధారణంగా ఒకప్పుడు హిట్ సినిమాలని ఇప్పటి హీరోలతో రీమేక్ చేయాలని చూస్తారు. అదే హీరో ఫ్యామిలీకి చెందిన హీరో తీస్తే మరింత హైప్ ఉంటుంది. మెగాస్టార్, పవర్ స్టార్ కి గతంలో ఉన్న హిట్ సినిమాలని ఇప్పుడు రీమేక్ చేయాలని చాలా మంది అనుకుంటారు కానీ అవి కొంచెం అటు ఇటు అయినా ఫ్యాన్స్ ఊరుకోరు, అందుకే అంత తొందరగా హిట్ సినిమాలని రీమేక్ చేసే సాహసం చేయరు.

Karthikeya2: తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారిగా కార్తికేయ-2.. అసలు విషయమేంటంటే?

తాజా ఇంటర్వ్యూలో వైష్ణవ్ మాట్లాడుతూ.. ”ఇద్దరి మామయ్యాల సినిమాలు చూస్తూ పెరిగాను. వాళ్ళ సినిమాలు ఎన్ని సార్లు చూశానో లెక్కేలేదు. చిరు మామయ్య, కళ్యాణ్ మామ సినిమాలని రీమేక్ చేయడమంటే సాహసమే. కానీ కథ మంచిగా కుదిరి, డైరెక్టర్ నన్ను కన్విన్స్ చేయగలిగితే నాకు బాగా ఇష్టమైన కళ్యాణ్ మామ సినిమా బద్రిని రీమేక్ చేయాలని ఉంది” అని తెలిపాడు. మరి భవిష్యత్తులో ఇది నిజంగా జరుగుతుందేమో చూడాలి.

Exit mobile version