Vakeel Saab Box Office Collection Pawan Kalyan Starrer Breaks Records Earns Rs 85 Crores In A Day
Vakeel Saab Box Office Collection: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో ఏప్రిల్ 9వ తేదీ విడుదలైన సినిమా వకీల్‌సాబ్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. సినిమా విడుదలై రెండు వారాలు గడిచినా.. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నా కూడా.. దూకుడు కొనసాగిస్తుంది. పవర్ స్టార్ గత సూపర్ హిట్ సినిమా వకీల్‌సాబ్ రికార్డులను తిరగరాసింది.
వకీల్ సాబ్ సినిమా 89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. ఇప్పటికే.. రూ. 85 కోట్లు షేర్ వసూలు చేసింది. పవన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా వకీల్ సాబ్ నిలిచింది. అంతకుముందు అత్తారింటికి దారేది 81 కోట్లు వసూలు చేయగా.. వకీల్ సాబ్ ఆ సినిమాను దాటేసింది. ఇంకా రూ. 4కోట్లు వసూలు చేస్తే.. సినిమా సేఫ్ అయిపోతుంది.
దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన వకీల్‌సాబ్ సినిమాను శ్రీరామ్ వేణు తెరకెక్కించగా అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలు పోషించారు. పింక్ సినిమా కథను పవన్ ఇమేజ్‌కు తగ్గట్లు మార్చి సినిమాను తెరకెక్కించగా.. విజయవంతంగా థియేటర్లలో సినిమాని ప్రదర్శిస్తున్నారు.
రెండు వరల్డ్ వైడ్ కలెక్షన్స్:
నైజాం- 24.25 కోట్లు
సీడెడ్- 12.84 కోట్లు
ఉత్తరాంధ్ర- 11.72 కోట్లు
ఈస్ట్- 6.17 కోట్లు
వెస్ట్- 7.19 కోట్లు
గుంటూరు- 7.09 కోట్లు
కృష్ణా- 4.91 కోట్లు
నెల్లూరు- 3.34 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)- 77.52 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 3.58 కోట్లు
ఓవర్సీస్- 3.84 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 85.17 కోట్లు షేర్