Chiranjeevi-Bobby : మరోసారి చిరంజీవి-బాబీ కాంబో.. కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్
చిరంజీవి, బాబీ కాంబినేషన్ (Chiranjeevi-Bobby) లోకొత్తగా తెరకెక్కనున్న చిత్ర కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు.

Chiranjeevi-Bobby movie Concept poster release
Chiranjeevi-Bobby : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వసిష్ఠతో ‘విశ్వంభర’ ఇప్పటికే ఫినిష్ చేసారు. మరోపక్క సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడితో మన శంకరవరప్రసాద్‌గారు చిత్రంలో నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. బాబీ (Bobby)దర్శకత్వంలోనూ ఓ చిత్రాన్ని లైన్‌లో పెట్టారు చిరు.
మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టిన రోజు నేడు (ఆగస్టు 22). ఈ సందర్భంగా ఈ చిత్ర (Chiranjeevi-Bobby)కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. నెత్తురు-గొడ్డలిని పోస్టర్‌లో చూపించారు. చూస్తుంటే ఇది యాక్షన్ మూవీలా అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.
Anil Ravipudi : చిరంజీవి, బాలయ్య కాంబోలో మూవీ.. అనిల్ రావిపూడి ఏమన్నారంటే?
KVN ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సెప్టెంబర్‌లో మొదలయ్యే ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ ఎవరు? కీలక పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు అన్న విషయాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.
Chiranjeevi-Bobby : మరోసారి చిరంజీవి-బాబీ కాంబో.. కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్
కాగా.. గతంలో చిరు, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో తాజా చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.