Anil Ravipudi : చిరంజీవి, బాలయ్య కాంబోలో మూవీ.. అనిల్ రావిపూడి ఏమన్నారంటే?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Director Anil Ravipudi comments on Chiranjeevi and Balakrisha combo movie
Anil Ravipudi : మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగా 157 వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. శుక్రవారం (ఆగస్టు 22) చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ను రివీల్ చేశారు.
ఈ చిత్రానికి మన శంకరవరప్రసాద్ గారు (Mana Sankaravaraprasadgaru) అని ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు.
ఈ టైటిల్ గ్లింప్స్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. చిరంజీవి, బాలకృష్ణ (Balakrishna) కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ చేసే ఛాన్స్ ఉందా? అనే ప్రశ్న అనిల్ రావిపూడికి ఎదురైంది.
Kothapallilo Okappudu : తెలుగు ఓటీటీలోకి వచ్చేసిన ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’..
ఈ ప్రశ్నకు అనిల్ ఇలా సమాధానం ఇచ్చారు. చిరంజీవి, వెంకటేశ్‌లతో మన ప్రయాణం మొదలైందన్నారు. ఛాన్స్ వస్తే ఖచ్చితంగా బాలయ్యతో సినిమా చేస్తానని ఇప్పటికే చిరంజీవి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఇద్దరు హీరోలు కూడా డిఫరెంట్ ఇమేజ్‌లు ఉన్న వారు. వీరిద్దరికి తగిలిన కథ దొరకాలి. అలాంటి కథ ఉంటే అప్పుడు చూద్దాం అని అనిల్ రావిపూడి అన్నారు.