Chiranjeevi : 70 ఏళ్లు వ‌చ్చినా చేతి నిండా సినిమాలు.. చిరంజీవి బ‌ర్త్ డే స్పెష‌ల్..

అభిమానుల గుండెల్లో అన్నయ్యగా ఇప్పటికీ వెండితెరపై తెరగని ముద్ర వేశారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). అంతేకాదు వన్ అండ్ ఓన్లీ

Chiranjeevi : 70 ఏళ్లు వ‌చ్చినా చేతి నిండా సినిమాలు.. చిరంజీవి బ‌ర్త్ డే స్పెష‌ల్..

Mega Star Chiranjeevi birthday special

Updated On : August 22, 2025 / 7:41 PM IST

Chiranjeevi : సిల్వర్ స్క్రీన్ సెన్సేషన్ కి 70 ఇయర్స్. సౌత్ ఇండస్ట్రీకి కేరాఫ్ అడ్రస్ గా, అభినయంతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే మెగాస్టార్ గా, అభిమానుల గుండెల్లో అన్నయ్యగా ఇప్పటికీ వెండితెరపై తెరగని ముద్ర వేశారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). అంతేకాదు వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ గా నిలిచారు.

కోట్లమంది అభిమానులకు అన్నయ్యగా, అప్‌కమింగ్ హీరోలకు ఇన్స్ పిరేషన్ గా , అదే ఎనర్జీ తో , అంతే యాక్టివ్ నెస్ తో ఇంకా ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యడమే పనిగా కంటిన్యూ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. 70 ఇయర్స్ లోకి ఎంటర్ అయిన మెగాస్టార్ చిరంజీవి సౌత్ సినిమాని.. స్పెషల్లీ తెలుగు సినిమాకి బాస్ గా పిలిపించుకుంటున్నారు. అందుకే ఎంతమంది హీరోలొచ్చినా.. మెగాస్టార్ కి ఉండే క్రేజ్, ఇమేజ్ వేరు.

చిరు కోసం యువ ద‌ర్శ‌కుల పోటీ..

చిరంజీవి (Chiranjeevi) కోసం అభిమానులే కాదు.. ఇంతమంది యంగ్ హీరోలున్నా.. చిరంజీవే కావాలని వెంటపడతారు యంగ్ డైరెక్టర్లు. యంగ్ డైరెక్టర్ల స్పీడ్ ని మ్యాచ్ చేసేలా చిరంజీవి తనను తాను మౌల్డ్ చేసుకున్నారు. ఆడియన్స్ కి నచ్చేలా సినిమాల్నిసెలక్ట్ చేసుకున్నారు. రొటీన్ ఇమేజ్ కి దూరంగా ఎక్స్ పెరిమెంట్స్ చెయ్యడానికి రెడీ అయ్యారు. అందుకే ఇన్నేళ్ల కెరీర్ ఇంకా సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ అవుతోంది.

Chiranjeevi-Bobby : మరోసారి చిరంజీవి-బాబీ కాంబో.. కాన్సెప్ట్‌ పోస్టర్‌ రిలీజ్‌

చిరంజీవి తో సినిమా చాన్స్ రానివాళ్లే కాదు ..ఆల్రెడీ సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టినవాళ్లు కూడా మళ్లీ ఎప్పుడు సినిమా చేద్దామా అని ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం చిరంజీవి 4 సినిమాలు లైన్లో పెట్టుకున్నారు. వాటిలో 2 సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీదున్నాయి. మిగిలిన 2 సినిమాలూ రేపో, మాపో షూటింగ్ మొదలుపెట్టబోతున్నాయి. వీటిలో ఒక దాన్లో చిరంజీవి గ్యాంగ్ స్టర్ గా , మరో సినిమాలో అడ్వెంచరర్ గా , ఇంకో సినిమాలో యాక్షన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు.

చిరంజీవి తో సినిమా మళ్లీ మళ్లీ చెయ్యాలని ట్రై చేస్తున్న డైరెక్టర్ల లిస్ట్ లో బాబీ కూడా ఉన్నారు. రెండేళ్లక్రితం సంక్రాంతికి బాబీ -చిరంజీవి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య సినిమా చేశారు.ఈ సినిమాతో మెగాస్టార్ మాంచి హిట్ కొట్టారు. మళ్లీ అదే సక్సెస్ ని రిపీట్ చెయ్యబోతున్నారు బాబీ-చిరంజీవి.

అంద‌రి క‌ళ్లు మన శంకరవరప్రసాద్ గారు పైనే..

చిరంజీవి తో సినిమా చెయ్యాలని మానిఫెస్ట్ చేసుకుని మరీ చాన్స్ దక్కించుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. అందుకే చిరంజీవి ఎన్ని సినిమాలు చేస్తున్నా..అందరి దృష్టి మాత్రం అనిల్ రావిపూడి చేస్తున్న మన శంకరవరప్రసాద్ పండక్కి వస్తున్నారు సినిమాలో చిరంజీవి ఎలా ఉంటారో అనే. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ లో నెక్ట్స్ లెవల్ లుక్ తో అదరగొట్టేశారు చిరంజీవి.

Kothapallilo Okappudu : తెలుగు ఓటీటీలోకి వచ్చేసిన ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’..

ఇప్పటి వరకూఫ్లాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ లోనే ఉన్న అనిల్ రావిపూడి, కామెడీ టైమింగ్ లో నెక్ట్స్ లెవల్ చూపించే చిరంజీవి కాంబినేషన్లో రాబోతున్న శంకర్ వరప్రసాద్ సినిమా మీదే అందరి దృష్టి. ఈరెండు హిలేరియస్ కాంబినేషన్ ని ఏరేంజ్ లో స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తారో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫాన్స్ .

లేటైనా స‌రే..

అనిల్ రావిపూడి తోపాటు ప్రజెంట్ చిరంజీవితో సినిమా చేస్తున్న యంగ్ డైరెక్టర్ వశిష్ట. ఒకే ఒక్కసినిమాచేసిన వశిష్టతో విశ్వంభరమూవీని ఎక్స్ పెరిమెంట్ గానే తీసుకుని చేస్తున్నారు చిరంజీవి. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి లాంటి సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్స్ తర్వాత హై ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజవ్వబోతున్న సినిమా విశ్వంభర. విశ్వంభర .. చిరంజీవిని మరోసారి వింటేజ్ స్టార్ గా చూపించబోతున్న సినిమా అని ఎగ్జైట్ అవుతున్నారు ఫాన్స్.

లేట్ అవుతున్నా సరే ..ఆ సినిమా మీద ఏమాత్రం ఇంట్రస్ట్ తగ్గకుండా ఫాన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసేలా తెరకెక్కిస్తున్నారు వశిష్ట. ఒకవైపు డిలే అవుతుందని ఫాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నా.. టైమ్ పడుతుంది, అయినా పర్లేదు.. వెయిట్ చెయ్యండి, సినిమా బావుంటుంది అంటూ స్వయంగా చెప్పడంతో కాస్త రిలాక్స్ అయ్యారు ఫాన్స్ . దీనికితోడు బర్త్ డే సందర్భంగా రిలీజైన టీజర్..సినిమామీదఅంచనాల్ని నెక్ట్స్ లెవల్లో పెంచేసింది. విశ్వంభర నెక్ట్స సమ్మర్ బరిలో రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఇక అనిల్ , వశిష్ట తో చేస్తున్న సినిమాలపై ఆడియన్స్ కి ఓ అంచనా ఉంది. ఏదో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యడానికి చేస్తున్నారని ఫిక్స్ అయిపోయారు. కానీ అసలు ఎగ్జైట్ మెంట్ అంతా..శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న యాక్షన్ మూవీ మీదే. మెగాస్టార్ కెరీర్ లోనే ఎక్కువయాక్షన్ , వయెలెన్స్ ఉన్న క్యారెక్టర్ గా ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈ సినిమాని నాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Chiranjeevi Birthday : గోవాలో చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్.. చరణ్ స్పెషల్ పోస్ట్.. వీడియో వైరల్..

బాబీతో గ్యాంగ్ స్టర్ మూవీ, శ్రీకాంత్ ఓదెల తో యాక్షన్ మూవీ, వశిష్ట తో సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నా కూడా అనిల్ రావిపూడి తో కమర్షియల్ ఎంటర్ టైనర్ చేస్తూ యంగ్ డైరెక్టర్లతో ఎంగేజ్ అవుతున్నారు. వీళ్లకి తోడు కల్కి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా చేసిన నాగాశ్విన్ కూడా చిరంజీవితో సినిమా చెయ్యాలనుందంటూ మనసులో మాట చెప్పారు.

చిరంజీవితో సినిమా అనౌన్స్ అయ్యి కూడా ఆ చాన్స్ మిస్ చేసున్నారు వెంకీకుడుముల. చిరంజీవి, వెంకీ కాంబినేషన్లో సినిమా దాదాపు అంతా సెట్ అనుకున్న టైమ్ లో కథ సరిగా సెట్ కాకపోవడంతో సెట్స్ మీదకెళ్లాల్సిన సినిమా ఆగిపోయింది. అయితే ఎప్పటికైనా చిరంజీవికి సెట్ అయ్యే మంచి కథచెప్పి సినిమా చేస్తానని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు వెంకీ. ఇలా యంగ్ హీరోలు చాలా మంది చిరంజీవి తో ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా అయినా చెయ్యాలని ఆరాటపడుతున్నారంటే ఆయన క్రేజ్ ఏరేంజ్ లో ఉందో అర్దం చేస్కోవచ్చు.