ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కానుకగా ఏకంగా అయిుదు సినిమాలు విడుదల కాబోతున్నాయి..
శుక్రవారం.. సినీ ప్రేమికులకు, తెలుగు ప్రేక్షకులకు పండగరోజు.. నటీనటులు, దర్శక నిర్మాతల, బయ్యర్ల భవిష్యత్ తెలిసిపోయే రోజు. ప్రతీవారం లానే ఈ వీకెండ్ కూడా ధియేటర్లలో చాలా సినిమాలు సందడి చేయడానికి సిద్ధమయ్యాయి.. అయితే ఈ ఫ్రైడే వాలెంటైన్స్ డే అవ్వడంతో సమ్ థింగ్ ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. లవ్ స్టోరీస్‌తోపాటు.. థ్రిల్లర్ జానర్ సినిమాలు కూడా రాబోతున్నాయి. ఈ సినిమాల సంగతి బ్రీఫ్‌గా చూద్దాం.
ఈ వీకెండ్‌కి 5 సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. అందులో అందరూ ఈగర్‌గా వెయి్ట చేస్తున్న సినమా.. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ డైరెక్షన్లో తెరెకెక్కిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశిఖన్నా, ఐశ్వర్యరాజేష్, క్యాథరిన్, ఇజబెల్లా హీరోయిన్లుగా నటించిన ఈ హార్డ్ కోర్ లవ్ స్టోరీ వ్యాలంటైన్స్ సందర్బంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతోంది. చాలా గ్యాప్ తర్వాత విజయ్ నుంచి వస్తున్న ఈ సినిమా నాలుగు లవ్ స్టోరీలతో తెరకెక్కింది. ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి.
సంజయ్ వర్మ, నవీన్, పునర్నవి లీడ్ రోల్స్‌లో సందీప్ చేగూరి డైరెక్షన్లో ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న సినిమా ‘ఒక చిన్న విరామం’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. డిఫరెంట్ స్టోరీతో వస్తున్న మరో మూవీ.. ‘లైఫ్ అనుభవించు రాజా’ కూడా ఈ శుక్రవారమే థియేటర్లలోకి రాబోతోంది. శృతి శెట్టి, జూనియర్ రవితేజ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు సురేష్ తిరుమూర్ దర్శకత్వం వహించారు.
సాయికృష్ణ స్వీయ దర్శకత్వం చేస్తూ.. డ్యూయల్ రోల్‌లో నటించిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్.. ‘బ్లాక్ బోర్డ్’. టైటిల్‌తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఈ ఫ్రైడే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాగర్ శైలేష్, ఈషా జంటగా తెరకెక్కిన ‘శివ 143’ కూడా శుక్రవారం రిలీజ్ అవుతోంది.
హీరో సాగర్ శైలేష్ ఈ సినిమాకి డైరెక్షన్ కూడా చేశాడు. సీనిమర్ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పనుల వల్ల ఆలస్యమై ఎట్టకేలకు విడుదల కానుంది. మరి ఈ వీకెండ్ రిలీజ్ అవుతున్న ఈ 5 సినిమాల్లో ఏ సినిమా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తుందో చూడాలి..
Click Here>>మరోసారి లేడీ డైరెక్టర్‌తో నాగ శౌర్య