Valentines Day Special Watch Love Movies in Aha OTT
Aha Love Movies : తెలుగు ఓటీటీ ఆహాలో రెగ్యులర్ గా కొత్త కొత్త సినిమాలు, షోలు, సిరీస్ లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. నేడు వాలెంటైన్ డే సందర్భంగా పలు లవ్ సినిమాలు ఆహాలో మరోసారి చూసేయండి. ఆహా ఓటీటీ వాలెంటైన్స్ డే సందర్భంగా క్లాసిక్ లవ్ స్టోరీస్ ను స్ట్రీమింగ్ చేస్తోంది. వాలెంటైన్స్ డే అకేషన్ కు ఈ లవ్ స్టోరీస్ మారథాన్ ఆహాలో కొనసాగనుంది.
మమితా బైజు, నల్సెన్ కె గఫూర్ జంటగా నటించిన మలయాళం డబ్బింగ్ సూపర్ హిట్ సినిమా ప్రేమలు..
సిద్ధార్త్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం..
శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ లీడ్ పెయిర్ గా నటించిన సామజవరగమన..
సిద్ధు జొన్నలగడ్డ, సీరత్ కపూర్ జోడీగా కనిపించిన మా వింత గాథ వినుమా..
సుహాస్, చాందినీ చౌదరిల కలర్ ఫొటో..
విశ్వదేవ్ రాచకొండ, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన నీలి మేఘ శ్యామ..
నిఖిల్, అనుపమ 18 పేజెస్..
కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ రాజావారు రాణిగారు..
దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ 100 డేస్ ఆఫ్ లవ్.. లాంటి సూపర్ హిట్ లవ్ స్టోరీస్ ఆహాలో స్ట్రీమ్ అవుతున్నాయి. ఈ వాలెంటైన్ డేకు మరోసారి ప్రేమ కథ సినిమాలు చూసేయండి.