Naga Chaitanya : ఇన్నేళ్ల తర్వాత కూడా యాక్టింగ్ స్కూల్ కి వెళ్లిన నాగ చైతన్య.. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? 20 రోజులు..
నాగచైతన్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన యాక్టింగ్ ఎడ్యుకేషన్ గురించి తెలిపాడు.

Do You Know Naga Chaitanya Still Learning Acting Went to Acting School Recently
Naga Chaitanya : నాగ చైతన్య ఇటీవల తండేల్ సినిమాతో వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నాగచైతన్య – సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో తండేల్ సినిమా తెరకెక్కింది.
ఏపీ నుంచి గుజరాత్ కు చేపల వేటకు వెళ్లే పలువురు మత్స్యకారులు అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లి వాళ్లకు చిక్కి పాకిస్థాన్ జైల్లో గడిపి ఎలా వచ్చారు అని రియల్ గా జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకొని ఓ లవ్ స్టోరీ జోడించి అందమైన ప్రేమ కథగా తెరకెక్కించారు. ఫిబ్రవరి 7న రిలీజయిన తండేల్ సినిమా ఇప్పటికే 90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి 100 కోట్లకు పరుగులు తీస్తుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన యాక్టింగ్ ఎడ్యుకేషన్ గురించి తెలిపాడు. రీసెంట్ గా నేర్చుకున్న యాక్టింగ్ గురించి మాట్లాడుతూ.. వరుసగా సినిమాలు చేస్తున్నా నేను యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. ఇది లైఫ్ లాంగ్ నేర్చుకునేది. రీసెంట్ గానే తండేల్ సినిమా మొదలయ్యే ముందు పాండిచ్చేరిలోని ఆదిశక్తి థియేటర్ స్కూల్ కి యాక్టింగ్ కోర్స్ కి వెళ్ళాను. జిమ్ కి, అందానికి వెళ్లడం కాదు.. మైండ్ మీద, నటన మీద ఫోకస్ చేస్తున్నారా ఒక నటుడు చెప్పిన ఒక కొటేషన్ చదివాను. తండేల్ స్క్రిప్ట్ వర్క్ జరిగేటప్పుడు నేను పాండిచ్చేరి యాక్టింగ్ స్కూల్ హాస్టల్ లో 20 రోజులు ఉన్నాను. యాక్టర్ కి బ్రీతింగ్ అనేది ఇంపార్టెంట్. అది ఇక్కడ నేర్చుకున్నాను. బ్రీతింగ్ ద్వారా కూడా యాక్టింగ్ చేయడం ఇక్కడే నేర్చుకున్నాను అని తెలిపారు.
ఇక సినిమాల్లోకి రాకముందు చైతు.. డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు నాగార్జునకు నటుడ్ని అవుతాను అని చెప్పాడు. అప్పుడు యాక్టింగ్ అంటే ఎంత కష్టమో ముందు తెలుసుకోవాలని సమ్మర్ హాలిడేస్ లో ముంబైలోని ఓ యాక్టింగ్ స్కూల్ లో నాలుగు నెలల కోర్స్ చేయించారు. డిగ్రీ అయ్యాక లాస్ ఏంజిల్స్ వెళ్లి అక్కడ ఒక సంవత్సరం యాక్టింగ్ కోర్స్ చేసాడు. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇంకో రెండేళ్లు యాక్టింగ్ కోర్స్ చేసి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇన్ని సినిమాల తర్వాత కూడా ఇప్పటికీ యాక్టింగ్ కోచింగ్ కి వెళ్తున్నాడు అంటే గ్రేట్ అని చెప్పొచ్చు.