Brahmanandam : హాస్పిటల్ బెడ్ మీద.. చనిపోయేముందు ఎమ్మెస్ నారాయణ చివరి కోరిక.. వెంటనే షూటింగ్ నుంచి బ్రహ్మానందం..
తాజాగా బ్రహ్మానందం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎమ్మెస్ నారాయణ చివరి రోజు గురించి మాట్లాడారు.

Brahmanandam Spoke About MS Narayana Last Day got Emotional
Brahmanandam : ఒకప్పటి సీనియర్ కమెడియన్స్ చాలా మంది వయోభారంతోనో, ఆరోగ్య సమస్యలతోనో కన్నుమూశారు. వారిలో ఎమ్మెస్ నారాయణ ఒకరు. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో నవ్వించి, పలు సినిమాల్లో ఎమోషన్ తో ఏడిపించారు. ఎమ్మెస్ నారాయణ – బ్రహ్మానందం మంచి మిత్రులు. తాజాగా బ్రహ్మానందం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎమ్మెస్ నారాయణ చివరి రోజు గురించి మాట్లాడారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఎమ్మెస్ నారాయణ చివరి రోజుల్లో మాట్లాడలేని పరిస్థితుల్లో బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయిని అడిగి ఒక పేపర్ తీసుకొని దానిమీద బ్రహ్మ అన్నయ్యని కలవాలని రాసారు. ఆయనకు ఎంతమంది ఫ్యామిలీ, రిలేషన్స్ ఉన్నా నన్ను చూడాలని ఉందని రాసారు. దాంతో ఆయన ఆయన కూతురు నాకు ఫోన్ చేసారు. అప్పుడు నేను గోపీచంద్ సినిమా షూటింగ్ లో శంషాబాద్ లో ఉన్నాను. నేను డైరెక్టర్ ని అడిగితే వద్దంటారేమో షూట్ ఉందని అని చెప్పకుండానే వచ్చేసాను. హాస్పిటల్ లో ఎమ్మెస్ బెడ్ మీద నుంచి నన్ను చూడగానే అతని కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి. నా చేయి పట్టుకొని ఉన్నాడు. కాసేపటికి బయటకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి షూటింగ్ నుంచి మధ్యలో వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయాను. డాక్టర్ తో కూడా మాట్లాడి ఎంత అయినా పర్లేదు చూడండి అని చెప్పి వెళ్ళాను. ఎందుకంటే అతను నేను సంపాదించుకున్న ఆస్తి. హాస్పిటల్ నుంచి నేను షూట్ కి తిరిగి వెళ్తుంటే దారిలో ఉండగానే ఆయన చనిపోయారు అని వార్తలు వచ్చాయి అంటూ ఎమోషనల్ అయ్యారు.
Also Read : Brahma Anandam : ‘బ్రహ్మ ఆనందం’ మూవీ రివ్యూ.. నవ్విస్తూనే ఏడిపించిన తండ్రీకొడుకులు..
అలా ఎమ్మెస్ నారాయణ చనిపోయేముందు తన చివరి కోరిక బ్రహ్మానందంను చూడాలనే కోరిక తీర్చుకొని వెళ్లారు. వీరిద్దరి మధ్య అంత మంచి అనుబంధం ఉంది. ఇక బ్రహానందం, తన కొడుకు రాజా గౌతమ్ తో కలిసి బ్రహ్మ ఆనందం అనే సినిమాలో నటించారు. ఈ సినిమా నేడు ఫిబ్రవరి 14న రిలీజయింది. నిజ జీవితంలో తండ్రికొడుకులైన బ్రహ్మానందం రాజా గౌతమ్ ఈ సినిమాలో తాత మనవడుగా నటించారు.