Vandematharam Srinivas Song on Beggar Free Society
Vandematharam Srinivas : భిక్షాటన రహిత సమాజం సాధించాలనే సందేశాన్ని తెలిపేలా ధర్మ యుగం పేరుతో వందేమాతరం శ్రీనివాస్ ఓ పాటను పాడి రూపొందించారు. ఈ పాటలో నటుడు నందకిషోర్ నటించారు. ఈ పాటను బీహెచ్. వీ. రామకృష్ణ రాజు నిర్మాణంలో డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించాడు.
Also Read : Aditya 369 : బాలయ్య సూపర్ హిట్ సినిమా ఆదిత్య 369 రీ రిలీజ్.. ఎప్పుడంటే..
తాజాగా ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ హైద్రాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ధర్మ యుగం – హ్యూమానిటీ బెగ్గర్ ఫ్రీ సిటీ అనే ట్యాగ్ లైన్ తో ఈ సాంగ్ ని విజేత సంస్థ పూర్వ విద్యార్థులు విజేత సంస్థల చైర్మన్ తో కలిసి తీసుకువచ్చారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి ఈ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ పాట పాడిన సింగర్ వందే మాతరం శ్రీనివాస్, నటుడు నందకిషోర్ పాల్గొన్నారు.
విజేత సంస్థల చైర్మన్ మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతను చాటుకునేందుకు ఈ పాటను రూపొందించాం. ఈ పాట ద్వారా సమాజంలో అందరు కలిస్తేనే బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చవచ్చు అన్నారు. ఈ సందర్భంగా అనాధలకు లాస్ట్ రైట్స్ నిర్వహిస్తున్న ఎన్జీవో, బిక్షాటన రూపు మాపేందుకు కృషి చేస్తున్న స్వచ్చంద సంస్థలు, పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న డాక్టర్స్ ను అవార్డులతో సన్మానించారు.