Varalakshmi Sarath Kumar : ‘నీ గురించి చెప్పడానికి ఈ ఒక్క నిమిషం చాలదు’.. భర్త బర్త్ డే రోజు స్పెషల్ వీడియో షేర్ చేసిన వరలక్ష్మి

తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Varalakshmi Sarath Kumar shared a special video on her husband birthday

Varalakshmi Sarath Kumar : తమిళ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తుంది. తెలుగులో భారీ సక్సెస్ లు అందుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అలా వరుస సినిమాలు చేస్తున్న సమయంలో నికోలన్ సచ్ దేవ్ తో ప్రేమాయణం నడిపి ఈ ఏడాది పెళ్లి చేసుకుంది.

Also Read : Sitara Ghattamaneni : ‘నిజ జీవితంలో నాన్న కూడా ముఫాసా లానే’.. మహేష్ కూతురు సితార స్పెషల్ వీడియో..

అయితే నేడు ఆమె భర్త నీకొలాన్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది వరలక్ష్మి..ఈ సంవత్సరంలో చాలా జరిగింది, అన్నీ చాలా వేగంగా జరిగాయి, నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అన్నీ మన అద్భుతమైన జ్ఞాపకాలే ఉన్నాయి.. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి ఈ ఒక్క నిమిషం సరిపోదు.నువ్వు నీలాగా ఉన్నందుకు చాలా థాంక్స్. నువ్వు నా పక్కన ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఇలాంటి భర్త ఉన్నందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని. దీనికంటే ఎక్కువ నిన్ను ఏమీ అడగలేను.. హ్యాపీ బర్త్ డే..” అంటూ తమ పెళ్ళికి సంబందించిన పలు ఫోటోలను షేర్ చేసింది. దీంతో ఆమె చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.