Varalaxmi Sarathkumar : అప్పుడు సమంత బాగానే ఉంది.. ఆ షూట్ అయ్యాకే సమంత అలా అయిందేమో.. వరలక్ష్మి కామెంట్స్..

వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ''సమంత నాకు 12 ఏళ్లుగా తెలుసు. చెన్నైలోనే మా స్నేహం మొదలైంది. యశోద సినిమాలో తనతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. యశోద సినిమా షూటింగ్ టైములో.......

Varalaxmi Sarathkumar comments on Samantha Health Issues

Varalaxmi Sarathkumar :  స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నట్టు, త్వరలోనే కోలుకుంటాను అని, అందుకే ఇన్ని రోజులు యాక్టీవ్ గా లేనని, త్వరలోనే మీ అందరి ముందుకి వస్తానని పోస్ట్ చేసింది సమంత. దీంతో సమంత అభిమానులు, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు తను త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్లు, పోస్టులు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ సమంతపై వ్యాఖ్యలు చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ్ లో ఫుల్ బిజీగా ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ సమంతతో కలిసి యశోద సినిమాలో నటించింది. ఈ సినిమా నవంబర్ 11న రిలీజ్ కానుంది. తాజాగా వరలక్ష్మి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత ఆరోగ్యం గురించి మాట్లాడింది.

Samantha : సమంత వ్యాధిపై నాగబాబు రియాక్షన్.. ఈ జనరేషన్‌లో గ్రేటెస్ట్ యాక్టర్ సమంత..

వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ”సమంత నాకు 12 ఏళ్లుగా తెలుసు. చెన్నైలోనే మా స్నేహం మొదలైంది. యశోద సినిమాలో తనతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. యశోద సినిమా షూటింగ్ టైములో ఇద్దరం కూర్చొని చాలా కబుర్లు చెప్పుకునేవాళ్ళం, చెన్నై రోజులని గుర్తుచేసుకునేవాళ్ళం. ఆ సమయంలో తను ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్టు ఎవరికీ అనిపించలేదు. షూట్ లో ఎప్పుడూ యాక్టీవ్ గా, ఫుల్ ఎనర్జీతో ఉండేది. అప్పుడైతే తను ఆరోగ్యంగానే ఉంది. యశోద సినిమా షూట్ తర్వాత తను ఆ వ్యాధి బారిన పడిందని అనుకుంటున్నాను. తను త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తుంది” అని తెలిపింది.