Anil Katz : ‘శబరి’ టైటిల్ అర్ధం ఏంటో తెలుసా? వరలక్ష్మి సినిమా గురించి దర్శకుడు అనిల్‌ కాట్జ్‌ ఏం చెప్పారంటే?

తాజాగా శబరి సినిమా దర్శకుడు అనిల్‌ కాట్జ్‌ మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను తెలియచేశారు.

Anil Katz : టాలీవుడ్ లో కొత్త కొత్త పాత్రలతో వరుస సినిమాలతో హిట్స్ కొడుతున్న వరలక్ష్మీ శరత్ కుమార్(Varalaxmi Sarathkumar) లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘శబరి’తో రాబోతుంది. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాణంలో వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన శబరి సినిమా పాన్ ఇండియా వైడ్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా దర్శకుడు అనిల్‌ కాట్జ్‌ మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను తెలియచేశారు.

అనిల్‌ కాట్జ్‌ మాట్లాడుతూ.. నాలుగేళ్ళ క్రితం శబరి ఆలోచన వచ్చింది. ప్రాణానికి మించి మనం దేన్నైనా ప్రేమిస్తే అది ప్రాణం తీసేంత ద్వేషంగా మారే అవకాశం ఉంది అనే పాయింట్ తో శబరి రాబోతుంది. తల్లి కుమార్తె ప్రేమ నేపథ్యంలో ఆ పాయింట్ ని చెప్పబోతున్నాను. రామాయణంలో రాముడి కోసం శబరి ఎదురుచూస్తుంది. ఆవిడ ప్రేమలో ఓ నిజాయతీ ఉంది. అలాగే సంస్కృతంలో శబరి అంటే ఆడ పులి అని అర్థం. దీంతో ఈ కథకు ఆ టైటిల్ సరిపోతుందని తీసుకున్నాను. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. శబరి కథలో ఉన్న వేరియేషన్స్ వరలక్ష్మీ శరత్ కుమార్ గారు మాత్రమే చేయగలరని ఆమెని కలిసి కథ చెప్పాను. ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడే ఓకే చేశారు అని తెలిపారు.

నిర్మాత మహేంద్రనాథ్ గారు ఒక సినిమా చేద్దామనుకుంటుంటే వరలక్ష్మి గారు ఓకే చేశారని నా కథ చెప్తే వెంటనే ఒప్పుకున్నారు. మిగిలిన ఆర్టిస్టులంతా కూడా బాగా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారితో నాకు ఎంత మంచివాడవురా సినిమా అప్పట్నుంచి పరిచయం ఉంది. ఈ సినిమాకు తల్లి ప్రేమతో పాటు థ్రిల్లర్ కి తగ్గట్టు మంచి సంగీతం ఇచ్చారు. వాతావరణం అనుకూలించక బడ్జెట్ కొంచెం పెరిగింది. విశాఖలో చేద్దామనుకున్న షూట్ కొడైకెనాల్ లో చేశాము అని తెలిపారు దర్శకుడు అనిల్‌ కాట్జ్‌.

Also Read : Geetu Roayal : అరుదైన వ్యాధితో బాధపడుతున్న బిగ్‌బాస్ గీతూ.. రెండేళ్లు చికిత్స తీసుకోవాలి.. డబ్బులు కూడా లేవు..

ఇక హనుమాన్ సినిమా తర్వాత వరలక్ష్మి గారికి పాన్ ఇండియా రీచ్ వచ్చింది. అలాగే ఆమెకు తమిళ మార్కెట్ ఉంది. అందుకే ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాము. శబరి సినిమాలో థ్రిల్లర్ తో పాటు చాలా ఎమోషన్స్ ఉన్నాయి. మంచి థియేట్రికల్ అనుభవం ఈ సినిమా ఇస్తుందని తెలిపారు దర్శకుడు.

ట్రెండింగ్ వార్తలు