Largo Winch : ‘వారసుడు’తో సహా చాలా సినిమాలకి ఈ సినిమానే ఇన్స్పిరేషన్..

ఒకే సినిమా.. ఎందరో డైరెక్టర్స్ కు ఇన్స్పిరేషన్ గా నిలిచింది. అది గొప్ప సినిమా ఏమీ కాదు. కానీ ఆ స్టోరీ ఎన్నో భాషల్లో అడాప్ట్ అయి సినిమాలుగా వచ్చింది. ఇప్పటికీ ఆ సినిమాను ప్రేరణగా తీసుకోవడం ఆగడం లేదు. తాజాగా ఆ మూవీ ఇన్స్పిరేషన్ తోనే వారసుడు సినిమా కూడా వచ్చింది. ఇప్పటికే...............

varasudu movie also inspired from Largo Winch movie

Largo Winch :  ఒకే సినిమా.. ఎందరో డైరెక్టర్స్ కు ఇన్స్పిరేషన్ గా నిలిచింది. అది గొప్ప సినిమా ఏమీ కాదు. కానీ ఆ స్టోరీ ఎన్నో భాషల్లో అడాప్ట్ అయి సినిమాలుగా వచ్చింది. ఇప్పటికీ ఆ సినిమాను ప్రేరణగా తీసుకోవడం ఆగడం లేదు. తాజాగా ఆ మూవీ ఇన్స్పిరేషన్ తోనే వారసుడు సినిమా కూడా వచ్చింది. ఇప్పటికే తమిళ్ లో వరిసు పేరుతో ఈ సినిమా రిలీజయింది. తెలుగులో జనవరి 14న వారసుడుగా రిలీజ్ కానుంది.

‘లార్గో వించ్’ అనే ఫ్రెంచ్ మూవీ ఎందరో ఇండియన్ డైరెక్టర్స్ కు ఇన్స్పిరేషన్ గా నిలిచింది. అది అంత సూపర్ హిట్ సినిమా ఏమీ కాదు. స్టోరీ లైన్ యూనిక్ కావడంతో ఎందరో డైరెక్టర్స్ ను అది ఇన్స్పైర్ చేసింది. ఒక సంపన్న కుటుంబం కొన్ని కారణాల వల్ల అస్తవ్యస్తం అవుతుంది. దాంతో ఆ ఇంటిని చక్కదిద్దడానికి ఎవరికీ తెలీకుండా ఎక్కడో ఉన్న మరో వారసుడు వస్తాడు. ఈ మూవీ ఇన్స్పిరేషన్ తోనే లేటెస్ట్ గా దళపతి విజయ్ ‘వారసుడు’ మూవీ తెరకెక్కింది.

Ee Nagaraniki Emaindi : ఈ సినిమాని కూడా రీ రిలీజ్ చేయాలా.. రిలీజ్ అయిన అయిదేళ్లకే..

‘లార్గో వించ్’ మూవీ ఇన్స్పిరేషన్ తో తెలుగులో ఇంతకు ముందు కూడా చాలా సినిమాలే వచ్చాయి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ కూడా ‘లార్గో వించ్’ ప్రేరణతోనే తెలుగులోకి వచ్చింది. కానీ ఈ సినిమా జనాలని ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇదే కథకి హాలీవుడ్ యాక్షన్స్ అద్ది ‘సాహో’గా తీశారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకి సుజిత్ డైరెక్టర్. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ చేసినా యావరేజ్ టాక్ తో బయటపడింది. మహేశ్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమా కూడా ‘లార్గో వించ్’ ప్రేరణతోనే రూపొందింది. అయితే దానికి బిజినెస్ కాకుండా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ని జతచేశారు. అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురములో మూవీ స్టోరీలో కూడా ‘లార్గో వించ్’ ఛాయలు కనిపిస్తాయి. ఇలా చాలా సినిమాల్లో ఈ కథ ఉన్నా కథనం మార్చి ఇక్కడి దర్శకులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఒక్క సినిమా కథని అనేకరకాలుగా తిప్పి కొంతమంది హిట్ కొడుతున్నారు, కొంతమంది ఫట్టవుతున్నారు.