Jabardast Varsha : రోడ్లపై జబర్దస్త్ వర్షను చూసి ఉరికిన జనం

వినాయక చవితి పండుగ సందర్భంగా...‘ఊరిలో వినాయకుడు’ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యింది. అందులో భాగంగా...వర్ష..టీమ్ లో సభ్యురాలిగా పాల్గొన్నారు.

Varsha

Varsha And Emmanuel : బుల్లితెరపై ఓ ఛానెల్ లో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ ప్రోగ్రాం..ప్రేక్షకులను అలరిస్తోంది. తమదైన శైలిలో కామెడీని పండిస్తూ..నటులు చేసే ఫెర్మామెన్స్ కు ఫిదా అయిపోతున్నారు. ఇందులో పాల్గొన్న నటులకు మంచి గుర్తింపే వస్తోంది. అందులో నటి వర్ష ఒకరు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోగ్రామల్లో ఈమె పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా…‘ఊరిలో వినాయకుడు’ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యింది. అందులో భాగంగా…వర్ష..టీమ్ లో సభ్యురాలిగా పాల్గొన్నారు.

Read More : Youngster Died : వినాయక మండపం వద్ద డ్యాన్స్‌ చేస్తూ యువకుడు మృతి

మారువేషం వేసుకుని..ప్రజల వద్దకు వెళ్లి…ఎవరికైనా ప్రపోజ్ చేసి వాళ్లతో ఒకే అనిపించుకోవాలని వర్షకు రామ్ ప్రసాద్ టాస్క్ విసురుతాడు. దీంతో వర్ష..యాచకురిలాగా రోడ్డు మీదకు వచ్చింది. తెల్లటి దుస్తులు, మాసిపోయిన ముఖం, చిరిగిని దుస్తులు ధరించి..పలు ట్రాఫిక్ చౌరస్తాల వద్ద తిరిగారు. అక్కడకు వచ్చిన వారిని ఏదో అడగడం ప్రారంభించారు.

Read More :TS High Court : టీఆర్ఎస్ కార్పొరేటర్ హత్య.. కాంగ్రెస్ నేత ప్రమేయం లేదన్న హైకోర్టు

దీంతో పలువురు విసురుకోగా..మరికొందరు పరుగులు తీశారు. వర్ష చేస్తున్న టాస్క్ ను చెడగొట్టడానికి ఇమ్మాన్యుయేల్ కూడా యాచకుడిగా రోడ్లపై కనిపించారు. ధర్మం చేయాలంటూ..వారిద్దరూ అడగడం..చౌరస్తాలో జనాలు పరుగులు తీయడం వీడియోలో కనిపించింది. సరదా సరదాగా ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వర్ష చేసిన ఫెర్మామెన్స్ అదిరిపోయింది అంటున్నారు నెటిజన్లు.