Varsham Movie Re Release: రెండు రోజులు జరుగనున్న ప్రభాస్ బర్త్ డే.. వర్షం మూవీ రీ రిలీజ్!

స్టార్ హీరోల పుట్టినరోజున వారి సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తుండగా, ఈ నెల 23న రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే కావడంతో అతడి సూపర్ హిట్ సినిమా అయిన "వర్షం" మూవీని విడుదల చేయడానికి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. "నట్ట్సి ఎంటర్టైన్మెంట్స్" ఈ సినిమా రీ రిలీజ్ బాధ్యతలు తీసుకున్నారు.

Varsham Movie Re Release

Varsham Movie Re Release: స్టార్ హీరోల పుట్టినరోజున వారి సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తుండగా, ఈ నెల 23న రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే కావడంతో అతడి సూపర్ హిట్ సినిమా అయిన “వర్షం” మూవీని విడుదల చేయడానికి మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. “నట్ట్సి ఎంటర్టైన్మెంట్స్” ఈ సినిమా రీ రిలీజ్ బాధ్యతలు తీసుకున్నారు.

Prabhas: “ధృవ” కథ ప్రభాస్ కోసం రాశా.. మోహన్ రాజా!

రెబల్, బిల్లా సినిమాలు రీ రిలీజ్ అవుతాయంటూ వార్తలు వచ్చినా, చివరకి వర్షం సినిమానే విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాను కేవలం డార్లింగ్ పుట్టినరోజున మాత్రమే కాకుండా.. 22, 23 తేదీలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో షోలు వేయబోతున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ, ఒక ప్రచార పోస్టర్ ను విడుదల చేశారు నిర్వాహకులు.

అయితే ఈ సినిమా ఏయే ఏరియాలో, ఏయే థియేటర్ లో విడుదల చేయబోతున్నారో అన్నది ఇంకా తెలియజేయలేదు. ఇందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకుల త్వరలో తెలియజేస్తారని సమాచారం. రీ రిలీజ్ అయిన సినిమాలు రికార్డు కలెక్షన్స్ సృష్టిస్తున్నాయి. మరి ప్రభాస్ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

Varsham Movie Re Release