Varun Sandesh : తన సినిమా రీ రిలీజ్ అవుతున్నట్టు హీరోకే తెలియదంట..

హ్యాపీడేస్ సినిమాని శేఖర్ కమ్ముల ఏప్రిల్ 19న రీ రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పోస్టర్స్, రీ రిలీజ్ ట్రైలర్ కూడా విడుదల చేసారు.

Varun Sandesh : ఇటీవల ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు, క్లాసిక్ సినిమాలు రీ రిలీజ్ అయి థియేటర్స్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకప్పుడు కొత్త వాళ్ళతో వచ్చి మంచి విజయం సాధించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమా హ్యాపీడేస్ రీ రిలీజ్ అవుతుంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2007లో వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్, రాహుల్, ఆదర్శ్, సానియా, కృష్ణుడు.. మరింతమంది కొత్తవాళ్లతో తెరకెక్కిన సినిమా అప్పట్లో యూత్ కి బాగా కనెక్ట్ అయి మంచి విజయం సాధించింది. ఇంజనీరింగ్ కాలేజీ లైఫ్, అక్కడి ప్రేమలు, కథలు, ఫ్రెండ్షిప్ చూపిస్తూ తీసిన హ్యాపీడేస్ ఇప్పటికి ఒక క్లాసిక్ సినిమాలా నిలిచింది. .

అప్పుడు కొత్తవాళ్లుగా ఈ సినిమా చేసిన వాళ్లలో కొంతమంది ఇప్పటికి సినిమాలు చేస్తుంటే కొంతమంది మాత్రం సినీ పరిశ్రమకు దూరమయ్యారు. హ్యాపీడేస్ సినిమాని శేఖర్ కమ్ముల ఏప్రిల్ 19న రీ రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పోస్టర్స్, రీ రిలీజ్ ట్రైలర్ కూడా విడుదల చేసారు. అయితే ఈ రీ రిలీజ్ సంగతి తనకి తెలీదు అని వరుణ్ సందేశ్ కామెంట్స్ చేయడం గమనార్హం.

Also Read : Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం లవ్ స్టోరీ తెలుసా? ప్రపోజ్ చేసుకోకుండా ప్రేమించుకొని.. ఎంగేజ్మెంట్ సీక్రెట్‌గా చేసుకోవాలని..

ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ శబరి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న వరుణ్ సందేశ్ కూడా పాల్గొన్నాడు. ఈ ఈవెంట్లో మీడియా వరుణ్ సందేశ్ ని తన సినిమాల రీ రిలీజ్ ల గురించి అడగగా.. అది నాకు తెలీదు, ప్రొడ్యూసర్స్ ని అడగాలి. హ్యాపీడేస్ రీ రిలీజ్ అవుతుందా? నేను ఎక్కడో చూసాను రీ రిలీజ్ అవుతున్నట్టు. ముందు ఏప్రిల్ 12 అని విన్నాను, ఇప్పుడు ఏప్రిల్ 19 అంటున్నారా? మంచిదే కదా అని అన్నారు. దీంతో వరుణ్ సందేశ్ కి హ్యాపీడేస్ సినిమా రీ రిలీజ్ గురించి ఎలాంటి సమాచారం లేనట్టు తెలుస్తుంది. శేఖర్ కమ్ముల తన సినిమాని రీ రిలీజ్ చేస్తున్నాడు కాని అందులో నటించిన ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని తెలుస్తుంది. తన సినిమా రీ రిలీజ్ అవుతుంటే దాని గురించి హీరోకే తెలియకపోవడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు