Operation Valentine : వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా టైటిల్ అదిరిందిగా.. ఆపరేషన్ వాలెంటైన్..
వరుణ్ 13వ సినిమాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతుందని ప్రకటించారు. వరుణ్ తేజ్ 13వ సినిమాని కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు.
- Saketh U
- Published on- August 14, 2023 / 12:25 PM IST
Varun Tej 13th Movie Titled as Operation Valentine movie will release in December
Operation Valentine : మెగా హీరోల్లో కెరీర్ మొదటి నుంచి కూడా వైవిధ్యమైన పాత్రలతో సినిమాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్(Varun Tej). సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలని అందిస్తున్నాడు. వరుణ్ తేజ్ గత సినిమా గని(Ghani) పరాజయం పాలైంది. ప్రస్తుతం వరుణ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే స్పై యాక్షన్ సినిమా చేస్తున్నాడు వరుణ్. ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కాబోతుంది.
ఇక ఆ సినిమా తర్వాత వరుణ్ 13వ సినిమాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతుందని ప్రకటించారు. వరుణ్ తేజ్ 13వ సినిమాని కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. వరుణ్ తో గని సినిమా నిర్మించిన రెనైసెన్స్ పిక్చర్స్ ఈ సినిమాని సోని పిక్చర్స్ తో కలిపి నిర్మిస్తుంది. ఈ సినిమా భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతుంది. ఇక ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ భామ మానుషి చిల్లర్ నటిస్తుంది.
Rashmika Mandanna : ధనుష్ సరసన రష్మిక.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఛాన్స్ కొట్టేసిన నేషనల్ క్రష్..
తాజాగా ఈ సినిమా టైటిల్ ని ప్రకటించారు చిత్రయూనిట్. వరుణ్ తేజ్ సినిమాకు ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే టైటిల్ ని ప్రకటించారు. టైటిల్ కొత్తగా డిఫరెంట్ గా కూడా అనిపిస్తుంది. ప్రేమ యుద్ధం కలిపి ఉండబోతుందా కథ అని భావిస్తున్నారు ఆడియన్స్. మరి ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో కొత్తగా ప్రయోగం చేస్తున్న వరుణ్ తేజ్ ఎలాంటి కథతో వస్తాడో చూడాలి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా డిసెంబర్ 8న రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో ఈ సంవత్సరం వరుణ్ వి రెండు సినిమాలు రానున్నాయి. రెండు డిఫరెంట్ కథలతో రాబోతున్నాడు ఈ మెగా హీరో.
