Rashmika Mandanna : ధనుష్ సరసన రష్మిక.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఛాన్స్ కొట్టేసిన నేషనల్ క్రష్..

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ పై ఆసియన్ సునీల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Rashmika Mandanna : ధనుష్ సరసన రష్మిక.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఛాన్స్ కొట్టేసిన నేషనల్ క్రష్..

Rashmika Mandanna is female lead in Dhanush Sekhar Kammula Movie

Updated On : August 14, 2023 / 12:27 PM IST

Rashmika Mandanna : ఇటీవల తమిళ హీరోలంతా తెలుగులో, తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ హీరో ధనుష్ కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ధనుష్ తెలుగులో డైరెక్టర్ వెంకీ అట్లూరితో ‘సర్’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వంద కోట్లకు పైగా కలెక్షన్స్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత తన సొంత దర్శకత్వంలో ధనుష్ 50వ సినిమా తెరకెక్కనుంది. ఇక ధనుష్ హీరోగా తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా గతంలోనే అనౌన్స్ చేశారు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ పై ఆసియన్ సునీల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇటీవలే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు చిత్రసయునిట్.

Bigg Boss 7 : బిగ్‌బాస్ లోకి కెవ్వు కార్తీక్.. అందుకే జబర్దస్త్ మానేశాడా?

శేఖర్ కమ్ముల – ధనుష్ సినిమాలో రష్మిక మందన్నని హీరోయిన్ గా తీసుకున్నట్టు ప్రకటించారు. దీంతో రష్మిక ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిన్స్ కి మంచి పాత్ర ఉంటుంది, గుర్తింపు బాగా వస్తుంది. అలాగే స్టార్ హీరో ధనుష్ పక్కన కావడంతో రష్మిక మందన్నకు ఈ సినిమా మరింత ప్లస్ అవుతుంది అని భావిస్తున్నారు ఆమె అభిమానులు. శేఖర్ కమ్ముల ధనుష్ లాంటి స్టార్ హీరోతో రష్మిక మందన్నని పెట్టి ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి మరి. ఇక దీనిపై స్పందిస్తూ ఈ సినిమా చేస్తున్నాను అంటూ రష్మిక ఓ స్పెషల్ వీడియో కూడా పోస్ట్ చేసింది.