Lavanya Tripathi : మెగా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఓ ఆరేళ్లు సైలెంట్ గా ప్రేమించుకొని 2023లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత రెగ్యులర్ గా ట్రిప్స్ కి వెళ్తూ ఆ ట్రిప్స్ ఫోటోలు కూడా షేర్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ సినిమాలు కూడా చేస్తున్నారు.
Also Read : Kiara Advani : మొదటిసారి బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన గేమ్ ఛేంజర్ భామ..
గత కొన్ని రోజులుగా లావణ్య ప్రగ్నెంట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వరుణ్, లావణ్య ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. చిన్ని షూస్ తో పాటు వరుణ్, లావణ్య కలిసి చేతులు పట్టుకున్న ఫోటోని తమ సోషల్ మీడియాలో షేర్ చేసి.. జీవితం మరింత అందంగా మారబోతుంది అని పోస్ట్ చేసారు.
దీంతో లావణ్య ప్రగ్నెంట్ వార్తలు నిజమే అని క్లారిటీ ఇచ్చేసారు. ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.