Varun Lavanya : పెళ్లి తర్వాత మొదటి సారి కలిసి బయటకి వచ్చిన వరుణ్ లావణ్య.. ఎవరికోసమో తెలుసా?

పెళ్లి తర్వాత మొదటిసారి వరుణ్, లావణ్య కలిసి బయటకి వచ్చారు.

Varun Tej Lavanya Tripathi Comes out for first time after their Marriage

Varun Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఇటీవల ఘనంగా ఇటలీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత హైదరాబాద్ లో సినీ ప్రముఖుల మధ్య రిసెప్షన్ కూడా గ్రాండ్ గా చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత మొదటిసారి వరుణ్, లావణ్య కలిసి బయటకి వచ్చారు.

వరుణ్, లావణ్య మొదటిసారి కలిసి ఓ సినిమా ఈవెంట్ కి వచ్చారు. నిహారిక(Niharika) నిర్మాతగా గతంలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు నిర్మించింది. మొదటిసారి సినిమాని నిర్మిస్తుంది. దీంతో ఈ సినిమా ఓపెనింగ్ కి పలువురు సినీ ప్రముఖులతో పాటు నిహారిక ఫ్యామిలీ మొత్తం రాగా నిహారిక అన్న వదినలు వరుణ్ లావణ్య కూడా వచ్చి సందడి చేశారు.

Also Read : Rahul Punarnavi : చాన్నాళ్లకు కలిసిన రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి.. బిగ్‌బాస్ మెమరీస్ గుర్తొస్తున్నాయంటూ కామెంట్స్..

వరుణ్ నిహారిక కొత్త సినిమాకి క్లాప్ కొట్టగా, నాగబాబు కెమెరా ఆన్ చేశారు. ఇక పెళ్లి తర్వాత మొదటిసారి వరుణ్ లావణ్యలు నిహారిక కోసం ఇలా సినిమా ఈవెంట్ కి రావడంతో వీరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.