Rahul Punarnavi : చాన్నాళ్లకు కలిసిన రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి.. బిగ్‌బాస్ మెమరీస్ గుర్తొస్తున్నాయంటూ కామెంట్స్..
రాహుల్ తన యూట్యూబ్ ఛానల్ కి ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తాడని తెలిసిందే. తాజాగా రాహుల్ సిప్లిగంజ్, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కలిసి ఓ ప్రైవేట్ సాంగ్ దుబాయ్ లో భారీగా ఖర్చుపెట్టి చేశారు.

Rahul Sipligunj Private Album Song Launched by Punarnavi Bhupalam
Rahul Punarnavi : బిగ్ బాస్(Bigg Boss) సీజన్ 3లో బెస్ట్ పెయిర్ అనిపించుకున్నారు రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాళం. హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత కూడా ఇద్దరూ ఫుల్ గా కలిసి తిరిగారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని వార్తలు వచ్చాయి. అయితే మేమేమిద్దరం జస్ట్ మంచి ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత రాహుల్ సింగింగ్ కెరీర్ లో బిజీ అవ్వగా, పునర్నవి విదేశాలకు వెళ్లి చదువుకుంటుంది.
చాన్నాళ్ల తర్వాత రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి కలిశారు. రాహుల్ తన యూట్యూబ్ ఛానల్ కి ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తాడని తెలిసిందే. తాజాగా రాహుల్ సిప్లిగంజ్, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కలిసి ఓ ప్రైవేట్ సాంగ్ దుబాయ్ లో భారీగా ఖర్చుపెట్టి చేశారు. ఇటీవలే ఈ పాటని రిలీజ్ చేశారు. అయితే రాహుల్ తలుచుకుంటే ఇప్పుడు ఏ పెద్ద సెలెబ్రిటీతో అయినా లాంచ్ చేయించొచ్చు తన పాటని.
Also Read : Mukesh Gowda : హీరోగా మారబోతున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్ రిషి..
కానీ పునర్నవితో ఉన్న స్నేహంతో తనని పిలిపించి రాహుల్ ఈ సాంగ్ లాంచ్ చేయించాడు. పునర్నవి సాంగ్ లాంచ్ చేసి రాహుల్ కి అల్ ది బెస్ట్ చెప్పింది. అనంతరం వీరిద్దరూ కాసేపు ముచ్చటించారు. పునర్నవి సాంగ్ లాంచ్ చేసిన వీడియోని రాహుల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రాహుల్, పునర్నవి కలిసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరూ చాన్నాళ్ల తర్వాత కలవడంతో వీరి ఫ్యాన్స్ అప్పటి బిగ్ బాస్ మెమరీస్ గుర్తొస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.