Mukesh Gowda : హీరోగా మారబోతున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్ రిషి..

సీరియల్ నటుడు ముకేశ్ గౌడ గుప్పెడంత మనసు(Guppedantha Manasu) సీరియల్ లో రిషి క్యారెక్టర్ తో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. ఈ సీరియల్ కి ప్రస్తుతం మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు ఈ సీరియల్ హీరో సినిమా హీరోగా మారుతున్నాడు.

Mukesh Gowda : హీరోగా మారబోతున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్ రిషి..

Guppedantha Manasu Serial Actor Mukesh Gowda starts a Movie as Hero

Updated On : November 10, 2023 / 9:36 PM IST

Mukesh Gowda : పలు టీవీ సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ నటుడు ముకేశ్ గౌడ.. గుప్పెడంత మనసు(Guppedantha Manasu) సీరియల్ లో రిషి క్యారెక్టర్ తో ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. ఈ సీరియల్ కి ప్రస్తుతం మంచి ఆదరణ ఉంది. ఇక ముకేశ్ గౌడకి అమ్మాయిల్లో, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ సీరియల్ హీరో సినిమా హీరోగా మారుతున్నాడు.

ఎస్‌.ఎస్‌.ఎం.జి ప్రొడక్షన్స్‌ పతాకంపై ముఖేష్‌గౌడ, ప్రియాంక శర్మ జంటగా నూతన దర్శకుడు రుద్ర దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్త కె. దేవానంద్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నేడు ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ‘గీతా శంకరం’ అనే టైటిల్ ని ప్రకటించారు. ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ నెల 14 నుండి సినిమా షూటింగ్ మొదలవుతుందని ప్రకటించారు చిత్రయూనిట్.

ఈ సందర్భంగా ముకేశ్ గౌడ మాట్లాడుతూ.. ఈ దీపావళి కానుకగా నేను నటిస్తున్న మొదటి సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ కథకు నన్ను హీరోగా సెలక్ట్‌ చేసుకున్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఇది లవ్‌ అండ్‌ ఎఫక్షన్‌తో కూడుకున్న సినిమా. సీరియల్స్‌లో ఎలా మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నానో.. ఈ సినిమాతో వెండితెర మీద కూడా మంచి పేరు తెచ్చుకుంటాననే గట్టి నమ్మకం ఉంది. యూత్‌కు ఈ గీతా శంకరం సినిమా బాగా నచ్చుతుంది అని తెలిపారు.

Also Read : Super Star Krishna Statue : విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఆవిష్కరించిన కమల్ హాసన్..

దీంతో ముకేశ్ గౌడ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కంగ్రాట్స్ చెప్తున్నారు. ఈ గీతా శంకరం సినిమాలో ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రియాంక గతంలో తెలుగులో మెన్ టూ, తంతిరం.. అనే పలు సినిమాల్లో నటించింది.