×
Ad

Varun Tej – Lavanya Tripathi : పెళ్ళికి ముందే అత్తారింటిలో లావణ్య త్రిపాఠి పండగ వేడుక..

పెళ్ళికి ముందే లావణ్య అత్తారింటిలోకి అడుగు పెట్టేసింది. వినాయక చవితి వేడుకను అత్తారింటిలో..

  • Published On : September 18, 2023 / 04:23 PM IST

Varun Tej Lavanya Tripathi vinayaka chavithi celebration pics viral

Varun Tej – Lavanya Tripathi : మెగా హీరో వరుణ్ తేజ్, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్ళికి ముందే లావణ్య అత్తారింటిలోకి అడుగు పెట్టేసింది. వినాయక చవితి వేడుకను అత్తారింటిలో జరుపుకుంది. నేడు వినాయక చవితి కావడంతో సెలబ్రిటీస్ అంతా ఇంటిలో పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా వరుణ్ కూడా కొన్ని ఫోటోలు షేర్ చేసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశాడు.

Bhagavanth Kesari : న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర.. భగవంత్ కేసరి ఫ్లాష్ మాబ్.. వీడియో వైరల్

ఇక ఈ ఫొటోల్లో వరుణ్ తేజ్ ఫ్యామిలీతో పాటు లావణ్య కూడా కనిపిస్తుంది. పెళ్ళికి ముందే అత్తారింటిలో పండుగా వేడుకను లావణ్య జరుపుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా ఈ జంట ఇటీవలే పెళ్లి షాపింగ్ ని కూడా మొదలు పెట్టారు. బాలీవుడ్ ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా షో రూమ్‌లో వ‌రుణ్‌, లావ‌ణ్య‌ తమ వెడ్డింగ్ కి సంబంధించిన డ్రెస్సెస్ కోసం షాపింగ్ చేశారు. పెళ్లి కోసం ప్రత్యేకంగా డిజైన్ వెర్ డ్రెస్సెస్ ని సిద్ధం చేయిస్తున్నట్లు తెలుస్తుంది.

Ram Charan : చిన్ని ‘క్లిన్ కారా’తో తొలి వినాయక చవితి.. చరణ్ స్పెషల్ పోస్ట్.. మెగా ఫ్యాలిలిలో గ్రాండ్‌గా వినాయక చవితి..

కాగా ఈ పెళ్లి వేడుక ఈ ఏడాది నవంబర్ లో ఉండబోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. నిశ్చితార్థం లాగానే పెళ్లిని కూడా ఇరు కుటుంబాలు మధ్యనే చేసుకోబోతున్నారు. ఇటలీలోని ఓ ఫ్యాలెస్‌లో వీరి వివాహం జ‌ర‌గ‌నుందని స‌మాచారం. ఆరు సంవ‌త్స‌రాల క్రితం మిస్ట‌ర్ సినిమాలో కలిసి నటించిన వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి.. ఆ స‌మ‌యంలోనే ప్రేమ‌లో పడ్డారు. ఆ త‌రువాత ఇద్దరు కలిసి మళ్ళీ అంత‌రిక్షం సినిమాలో క‌లిసి న‌టించారు. అయితే ఈ ప్రేమ విష‌యాన్ని ఎంగేజ్‌మెంట్ తరువాతే బయట పెట్టారు.