Matka : అతడి జీవిత ఆధారంగా వరుణ్ తేజ్ ‘మట్కా’ మూవీ.. అదే కథతో అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ప్రకటన..

అతడి జీవిత ఆధారంగా వరుణ్ తేజ్ 'మట్కా' మూవీ రాబోతుందట. అయితే అదే కథతో బాలీవుడ్ నటుడు 'విజయ్ వర్మ'తో అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్..

varun tej matka story is based on Ratan Khatri life story

Matka : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇతర హీరోల మాదిరి కమర్షియల్ సినిమాలు కాకుండా వైవిద్యమైన సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తుంటారు. ఈక్రమంలోనే గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ వంటి సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చి పెద్ద సక్సెస్ ని అందుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ హీరో కరుణకుమార్ దర్శకత్వంలో ‘మట్కా’అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ 1960 బ్యాక్‌డ్రాప్‌తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది.

గ్యాంబ్లింగ్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో అర్ధమవుతుంది. కాగా ఈ చిత్రం గ్యాబ్లింగ్ మార్కెట్ లో కింగ్‌లా ఎదిగిన ‘రతన్ ఖత్రి’ జీవితం ఆధారంగా రూపొందుతుందని టాక్ వినిపిస్తుంది. కాటన్ బిజినెస్ చేసే రతన్ ఖత్రి.. ముంబైలో మట్కా పేరిట బెట్టింగ్ స్టార్ట్ చేసాడు. కాలక్రమంలో ఆ గ్యాంబ్లింగ్ భారతదేశమంతటా ఒక పెద్ద బెట్టింగ్ బిజినెస్ గా మారిపోయింది. ఆ రోజుల్లోనే మట్కాలో రోజుకి కోటి రూపాయిల బెట్టింగ్ జరిగేదట.

Also read : Inimel : శృతిహాసన్‌తో లోకేష్ కనగరాజ్ రొమాన్స్ మాములుగా లేదు.. టీజర్ చూసారా..!

అతడి కథనే ఆధారంగా తీసుకోని తెలుగు నేటివిటీకి తగ్గట్లు ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్ లో వరుణ్ ‘మట్కా’ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే, తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో.. ఇదే స్టోరీతో ఓ వెబ్ సిరీస్ ని అనౌన్స్ చేసింది. బాలీవుడ్ నటుడు ‘విజయ్ వర్మ’ని రతన్ ఖత్రి పాత్రలో చూపిస్తూ ఈ సిరీస్ ని రూపొందించబోతున్నారట. ఈ వెబ్ సిరీస్ కి ‘మట్కా కింగ్’ అనే టైటిల్ ని పెట్టారు.

మరి ఈ రెండిటిలో ఏది ప్రేక్షకుల ఆదరణ అందుకుంటుందో చూడాలి. కాగా వరుణ్ తేజ్ నటిస్తున్న ‘మట్కా’ని పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంటే నోరా ఫతేహి, నవీన్ చంద్ర, రవి శంకర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెకండ్ లో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు