Inimel : శృతిహాసన్‌తో లోకేష్ కనగరాజ్ రొమాన్స్ మాములుగా లేదు.. టీజర్ చూసారా..!

శృతిహాసన్‌, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి ఓ ఆల్బమ్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు ఆ సాంగ్ టీజర్ రిలీజ్ అయ్యింది.

Inimel : శృతిహాసన్‌తో లోకేష్ కనగరాజ్ రొమాన్స్ మాములుగా లేదు.. టీజర్ చూసారా..!

Shruti Haasan Lokesh Kanagaraj Inimel song Teaser released

Updated On : March 21, 2024 / 7:22 PM IST

Inimel : శృతిహాసన్ స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు, మంచి పాప్ సింగర్ అని కూడా అందరికి తెలిసిందే. ఇప్పటికే ఆమె చాలా పాప్ సాంగ్స్‌తో పాటు పలు సినిమాల్లో కూడా పాటలు పాడుతూ అలరిస్తూ వచ్చారు. తాజాగా ‘ఇనిమెల్’ అనే ఒక ఆల్బమ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేసారు. కమల్ హాసన్ ఈ ఆల్బమ్ సాంగ్ కి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అంతేకాదు పాటకి లిరిక్స్ కూడా ఆయనే రాశారు.

ఇక ఈ పాటని కంపోజ్ చేయడం, పాడడం, వీడియోగా తెరకెక్కించే దర్శకత్వ భాద్యతలు అన్ని శృతిహాసన్ తీసుకున్నారు. ఈ పాటలో మరో విశేషం ఏంటంటే.. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ పాటలో శృతిహాసన్ కి జోడిగా, హీరోగా నటించారు. తాజాగా ఈ సాంగ్ టీజర్ ని కమల్ హాసన్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో శృతిహాసన్‌తో లోకేష్ కనగరాజ్ రొమాన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు.

Also read : Marvel 1943 : ఇది కదా మార్వెల్ ఫ్యాన్స్‌కి కావాల్సింది.. కెప్టెన్ అమెరికా వెర్సస్ బ్లాక్ పాంథర్..

ఈ వీడియో చూసిన ఆడియన్స్.. లోకేష్ నుంచి ఇలాంటి ఓ యాంగిల్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిన్న టీజర్ తో ఆడియన్స్ లో ఫుల్ సాంగ్ పై ఆసక్తిని క్రియేట్ చేసారు. ఈ సాంగ్ ఫుల్ వెర్షన్ ని మార్చి 25న రిలీజ్ చేయబోతున్నారు. మరి ఒక చిన్న టీజర్ లోనే ఏ రేంజ్ రొమాన్స్ చూపించిన మేకర్స్.. ఫుల్ సాంగ్ లో ఎలాంటి రొమాన్స్ తో ఆకట్టుకుంటారో చూడాలి.