Marvel 1943 : ఇది కదా మార్వెల్ ఫ్యాన్స్‌కి కావాల్సింది.. కెప్టెన్ అమెరికా వెర్సస్ బ్లాక్ పాంథర్..

'అవెంజర్స్ ఎండ్ గేమ్' తరువాత కిక్ ఇచ్చే సరైన యూనివర్స్ కోసం చూస్తున్న మార్వెల్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్. కెప్టెన్ అమెరికా వెర్సస్ బ్లాక్ పాంథర్..

Marvel 1943 : ఇది కదా మార్వెల్ ఫ్యాన్స్‌కి కావాల్సింది.. కెప్టెన్ అమెరికా వెర్సస్ బ్లాక్ పాంథర్..

Captain America Black Panther Marvel 1943 Rise of Hydra

Updated On : March 21, 2024 / 9:02 PM IST

Marvel 1943 : ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ తరువాత మార్వెల్ ఫ్యాన్స్ కి మళ్ళీ ఆ రేంజ్ కిక్ ఇచ్చే యూనివర్స్ ఒకటి కనిపించడం లేదు. మార్వెల్ వాళ్ళే ఆ మధ్య ‘ఎటర్నల్స్’తో ఒక కొత్త యూనివర్స్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేసారు గాని.. అది పెద్దగా వర్క్ అవుట్ లేదు. దీంతో ఒకప్పటి అవెంజర్స్ పాత్రలతోనే మళ్ళీ ఓ కొత్త యూనివర్స్ ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈక్రమంలోనే గత అవెంజర్స్ స్టోరీలోని ఒక పాయింట్ గా చెప్పి వదిలేసిన విషయాలను.. ఇప్పుడు స్టోరీగా తీసుకోని ఆడియన్స్ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఆడియన్స్ ముందుకు రాబోతున్నదే ‘మార్వెల్ 1943 రైజ్ అఫ్ హైడ్రా’. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇది సినిమాగా కాదు గేమ్ గా రాబోతుంది. అవెంజర్స్ లో హైడ్రా, షీల్డ్ వంటి ఆర్గనైజేషన్ పేర్లు వినే ఉంటారు. ఇప్పుడు ఈ హైడ్రా ఆర్గనైజేషన్ కథలను మెయిన్ కథాంశంగా తీసుకోని ఓ గేమ్ గా రూపొందిస్తున్నారు.

Also read : Rakshit Atluri – Komalee Prasad : మలయాళ హీరోయిన్స్‌కి హారతులు.. కానీ తెలుగు యాక్ట్రెస్‌ని టాలీవుడ్‌లో కూడా తక్కువగానే..

రైజ్ అఫ్ హైడ్రా అంటూ వరల్డ్ వార్ 2 నేపథ్యంతో.. కెప్టెన్ అమెరికా అండ్ బ్లాక్ పాంథర్ పాత్రల పోరాటం చూపించబోతున్నారు. ఈ గేమ్ కి సంబంధించిన స్టోరీ ట్రైలర్ ని మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ లో కెప్టెన్ అమెరికా అండ్ బ్లాక్ పాంథర్ హైడ్రా పై పోరాటం చేస్తూ.. ఒక సమయంలో తాము ఇద్దరు కూడా గొడవ పడబోతున్నట్లు చూపించారు. ట్రైలర్ అయితే మార్వెల్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేస్తుంది. 2025లో ఈ గేమ్ ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.