Varun Tej : ఇంకా స్టిక్ పట్టుకొనే నడుస్తున్న వరుణ్ తేజ్.. తన కాలు గాయంపై స్పందించిన మెగా హీరో..

నేడు కొరియన్ కనకరాజు సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి కూడా వరుణ్ తేజ్ ఊత కర్ర సాయంతోనే హాజరయ్యాడు.(Varun Tej)

  • Published on- August 1, 2026 / 02:03 PM IST

Varun Tej

Varun Tej : వరుణ్ తేజ్ కు ఇటీవల బరి సినిమా కోసం ఫుట్ బాల్ నేర్చుకుంటుండగా కాలికి గాయం అయి ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. దాంతో గత మూడు నెలలుగా వరుణ్ ఇంట్లోనే ఉంటున్నాడు. తన కొరియన్ కనకరాజు సినిమా ఆగస్టు 7న రిలీజ్ అవుతుండగా ఈ సినిమా ప్రమోషన్స్ కి మాత్రం అటెండ్ అవుతున్నాడు. ఈ ఈవెంట్స్ కి కూడా స్టిక్ పట్టుకొని మెల్లిగా నడుస్తూ చాలా కష్టంగా ఉన్నా సినిమా ప్రమోషన్స్ కోసం వస్తున్నాడు.

నేడు కొరియన్ కనకరాజు సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి కూడా వరుణ్ తేజ్ ఊత కర్ర సాయంతోనే హాజరయ్యాడు. ఈ ఈవెంట్లో తన కాలి గాయం ఎలా ఉందంటూ మీడియా అడగడంతో క్లారిటీ ఇచ్చాడు.

Also Read : Korean Kanakaraju Trailer : ‘కొరియన్ కనకరాజు’ ట్రైలర్ వచ్చేసింది.. వరుణ్ తేజ్ అదరగొట్టాడుగా..

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పర్వాలేదు. ఇంకా పూర్తిగా కోలుకోడానికి రెండు నుంచి మూడు నెలలు పడుతుంది. ఆ తర్వాతే నెక్స్ట్ సినిమా షూటింగ్ మొదలవుతుంది అని తెలిపారు. దీంతో వరుణ్ ఇంకా కాలి గాయం నుంచి కోలుకోలేదని తెలుస్తుంది. దీంతో వరుణ్ త్వరగా కోలుకోవాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.