×
Ad

Varun Tej : ఆ పండక్కి మా ఇంట్లో ఆడవాళ్లందరికి సెలవు.. మెగా ఫ్యామిలీ సీక్రెట్స్ రివీల్ చేసిన వరుణ్ తేజ్..

తాజాగా వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ గురించి కొన్ని సీక్రెట్స్ రివీల్ చేసాడు.

  • Published On : February 25, 2024 / 04:24 PM IST

Varun Tej Reveals Mega Family Secrets in Operation Valentine Movie promotions

Varun Tej : మెగా ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఏ పండగ వచ్చినా మెగా – అల్లు ఫ్యామిలీలు కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. అందరూ కలిసి వంటలు వండుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ సరదాగా పండగలను ఎంజాయ్ చేస్తారు. ఇటీవల సంక్రాంతికి మెగా – అల్లు ఫ్యామిలీలు చిన్నా పెద్దా అందరూ కలిసి బెంగుళూరులో ఫుల్ గా ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. వీరి ఫుల్ ఫ్యామిలీ ఫోటో కూడా బాగా వైరల్ అయింది అప్పట్లో.

తాజాగా వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ గురించి కొన్ని సీక్రెట్స్ రివీల్ చేసాడు. వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చ్ 1న రిలీజ్ కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీ గురించి ఎవ్వరికి తెలియని సీక్రెట్స్ ఏమైనా చెప్పమని అడగగా వరుణ్ తేజ్ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.

Also Read : Chaari 111 : వెన్నెల కిషోర్ కూడా సినిమాటిక్ యూనివర్స్.. స్పై కామెడీ ఫిలిమ్స్‌తో.. కమెడియన్స్ ఎవరెవరు వస్తారో?

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. మా ఫ్యామిలీ అంతా పండగల సమయంలో అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తామని తెలిసిందే. అయితే సంక్రాంతి పండగల సమయంలో మా ఇంట్లో లేడీస్ అందరికి సెలవు ఇచ్చి మేమే వంట చేయడం, పనులు చేయడం లాంటివి చేస్తాము. మొన్న సంక్రాంతికి కూడా అంతే. అంతే కాకుండా సంక్రాంతికి మేము క్రికెట్ ఆడతాము. మొత్తం మెగా ఫ్యామిలీలో ఉన్న అందరూ చరణ్, నేను, బన్నీ, వైష్ణవ్ తేజ్, సాయి తేజ్, అకిరా, శిరీష్.. ఇలా అందరం కలిసి రెండు గ్రూప్స్ గా విడిపోయి క్రికెట్ ఆడతాము. ఫుల్ గా ఎంజాయ్ చేస్తాము అని తెలిపాడు.