Chaari 111 : వెన్నెల కిషోర్ కూడా సినిమాటిక్ యూనివర్స్.. స్పై కామెడీ ఫిలిమ్స్‌తో.. కమెడియన్స్ ఎవరెవరు వస్తారో?

కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా మారి చారి 111 అనే సినిమాతో హీరోగా రాబోతున్నాడు.

Chaari 111 : వెన్నెల కిషోర్ కూడా సినిమాటిక్ యూనివర్స్.. స్పై కామెడీ ఫిలిమ్స్‌తో.. కమెడియన్స్ ఎవరెవరు వస్తారో?

Vennela Kishore Chaari 111 Movie Director says creates new Cinematic Universe with Spy Comedy Films

Chaari 111 Movie : కమెడియన్ వెన్నెల కిషోర్(Vennela Kishore) హీరోగా మారి చారి 111 అనే సినిమాతో హీరోగా రాబోతున్నాడు. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుండగా సత్య, మురళి శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీర్తి కుమార్ దర్శకత్వంలో బర్కత్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. చారి 111 సినిమా మార్చ్ 1న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు మూవీ యూనిట్.

ఆల్రెడీ చారి 111 టీజర్, ట్రైలర్స్ తో మంచి అంచనాలు నెలకొల్పారు. దేశానికి ఓ ఆపద వస్తే సీక్రెట్ ఏజెంట్స్ ని దాన్ని పరిష్కరించడానికి పిలుస్తారు. అందులో చారి కూడా ఉంటాడు. ఒక సీరియస్ ఇష్యూని చారి కామెడీగా ఎలా డీల్ చేసాడు అనే కథాంశంగా స్పై కామెడీ ఫిలింగా ఈ సినిమా ఉండబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది.

Also Read : Rashmika Mandanna : రష్మిక సక్సెస్‌ని ఎందుకు ఎంజాయ్ చేయట్లేదు? ఫ్యాన్స్ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పిందంటే?

దర్శకుడు కీర్తి కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. స్పై కామెడీ ఫిలిమ్స్ తో ‘రుద్రనేత్ర సినిమాటిక్ యూనివర్స్’ ని సృష్టిస్తున్నాను అని, అందులో చారి 111 మొదటి సినిమా అని, త్వరలో ఈ యూనివర్స్ నుంచి మరిన్ని స్పై కామెడీ సినిమాలు వస్తాయని తెలిపాడు. ఇటీవల సినిమాటిక్ యూనివర్స్ లు వచ్చి ఒక సినిమాకి, ఇంకో సినిమాకి లింక్స్ ఇస్తూ చాలామంది నటీనటుల్ని యూనివర్స్ లోకి తీసుకొస్తూ కలిసి నటింపచేస్తున్నారు. ఇప్పుడు ఈ స్పై కామెడీ ఫిలిమ్స్ తో సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పడంతో వెన్నెల కిషోర్ తర్వాత ఇంకా ఎవరైనా కమెడియన్స్ నటిస్తారా లేదా వేరే హీరోలు ఈ యూనివర్స్ లో నటిస్తారా అని ఆసక్తి నెలకొంది.