Rashmika Mandanna : రష్మిక సక్సెస్‌ని ఎందుకు ఎంజాయ్ చేయట్లేదు? ఫ్యాన్స్ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పిందంటే?

రష్మిక వరుస ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నారు. తాజాగా ఈ నటికి అభిమానుల నుండి ఒక ప్రశ్న ఎదురైంది. అందుకు సమాధానంగా రష్మిక సుదీర్ఘ పోస్టు పెట్టారు. అసలేంటది?

Rashmika Mandanna : రష్మిక సక్సెస్‌ని ఎందుకు ఎంజాయ్ చేయట్లేదు? ఫ్యాన్స్ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పిందంటే?

Rashmika Mandanna

Rashmika Mandanna : చేతినిండా సినిమాలతో రష్మిక మందన్న ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే రష్మిక తన సినిమాల సక్సెస్‌ని ఎంజాయ్ చేయట్లేదంటూ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. దీనిపై క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు రష్మిక.

రష్మిక వరుసగా ప్రాజెక్టులు చేస్తున్నారు. ‘యానిమ’ హిట్ తర్వాత ‘పుష్ప 2: ది రూల్’  సినిమాతో బిజీగా ఉన్నారు. దీంతో పాటు రెయిన్బో, ది గాళ్ ఫ్రెండ్, చావా వంటి తెలుగు, హిందీ ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి. రష్మిక సక్సెస్‌ను ఎంజాయ్ చేయడం లేదు.. ఫ్యాన్స్‌కి కూడా సమయం ఇవ్వడం లేదు అంటూ తన చుట్టూ తిరుగుతున్న వార్తలపై రష్మిక స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు.

Tripti Dimri Birth Day Celebrations : యానిమల్ భామ త్రిప్తి దిమ్రి బర్త్‌డే సెలబ్రేషన్స్..

రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో తన పూర్తి ఫేస్ కనపడకుండా ఫోన్ అడ్డంగా పెట్టుకున్న ఫోటోను షేర్ చేసారు. అది తన కొత్త సినిమా లుక్ కనుక టీమ్ రివీల్ చేయకుండా తన ఫేస్ చూపించలేనని చెప్పారు. షూటింగ్ బాగా జరుగుతోందని కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నా అంటూ మొదలుపెట్టారు. ముఖ్యంగా తను సక్సెస్ ఎంజాయ్ చేయట్లేదంటూ తన చుట్టూ తిరుగుతున్న వార్తలకు రిప్లై ఇచ్చారు. తనకి అందరూ అనుకునేలా కొంత సమయం ఆనందంగా గడపాలని ఉందని.. కానీ తన సినిమా విడుదలైన మర్నాడే కొత్త సినిమా షూటింగ్ కోసం సెట్స్‌కి రావాల్సి వచ్చిందని.. తాను అద్భుతమైన వర్క్ హాలిక్ నని రష్మిక చెప్పారు. అందుకే తను ఇంటర్వ్యూలలో, ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నానని.. తను ఒప్పుకున్న భారీ ప్రాజెక్టుల కోసం రాత్రుళ్లు సైతం ప్రయాణాలు చేస్తున్నానని రాశారు.

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ – జాకీ భగ్నానీ పెళ్లి, రిసెప్షన్ నుంచి మరిన్ని ఫొటోలు.. చూశారా?

రష్మిక తను కూడా అభిమానులను మిస్ అవుతున్నానని.. దయచేసి అందరూ సంయమనం పాటించమని  రిక్వెస్ట్ చేశారు. తాను నిజంగానే సక్సెస్‌ని ఎంజాయ్ చేయట్లేదని.. అభిమానుల ప్రేమ, ప్రేమతో కూడిన వారి మెసేజ్‌లు తనకు సంతోషాన్నిస్తాయని.. ఇకపై సమయం వెచ్చించడానికి ప్రయత్నం చేస్తానని రాసారు. తన చుట్టూ ఎంతో సపోర్ట్ చేసే నటీనటులు, అభిమానులు ఉన్నారని.. అందుకే తనకు ఎలాంటి బెంగ, భయం లేవని.. వారందరినీ ఎల్లప్పుడూ ప్రేమిస్తానని రష్మిక మందన్న తన పోస్టులో పేర్కొన్నారు. ఇక రష్మిక పోస్టుపై అభిమానులు స్పందించారు. ‘మీ కోసం ఎంత సమయమైనా ఎదురుచూస్తామని.. సినిమాలతో బిజీగా ఉన్న తమని మర్చిపోవద్దని’ కామెంట్స్ చేశారు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నానంటూనే అభిమానుల కోసం ఎంతో బాధ్యతగా పోస్టు పెట్టిన రష్మికను చూస్తే అందుకే ఇంతమంది అభిమానం సంపాదించుకున్నారనిపిస్తోంది.