Vasuki Anand re entry in movies after 25 years
Vasuki Anand : సంతోష్ శోభన్(Santhosh Soban), మాళవిక నాయర్(Malavika Nayar) జంటగా నందిని రెడ్డి(Nandini reddy) దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘అన్నీ మంచి శకునములే’. ఈ సినిమా మే 18న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో దాదాపు 25 ఏళ్ళ తర్వాత వాసుకి(Vasuki) నటించింది. తొలిప్రేమ(Tholiprema) సినిమాలో పవన్ కళ్యాణ్(Pavan Kalyan) చెల్లిగా నటించిన వాసుకి ఆ పాత్రతో అందర్నీ మెప్పించింది. కానీ ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు. పవన్ కళ్యాణ్ స్నేహితుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది వాసుకి. వీరి పెళ్లి పవన్ కళ్యాణ్ దగ్గరుండి చేశాడు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన వాసుకి ఇన్నాళ్లకు మళ్ళీ వెండితెరపై కనిపించబోతుంది.
అన్నీ మంచి శకునములే సినిమాలో సంతోష్ శోభన్ అక్క పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వాసుకి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. వాసుకి ఆనంద్ మాట్లాడుతూ.. తొలిప్రేమ సినిమా చేశాక చాలా అవకాశాలు వచ్చాయి. కానీ నాకు చెయ్యడం కుదర్లేదు. నేను మల్టీటాస్క్ చేయలేను. ఇక పెళ్లి అయ్యాక ఫ్యామిలీ, పిల్లలతో ఇన్నాళ్లు గడిపేసా. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయి విదేశాల్లో చదువుకుంటున్నారు. ఇప్పుడు నాకు తీరిక సమయం దొరికింది. సైకాలజీలో PhD చేస్తున్నాను. నేను సినిమాల్లో నటించకపోయినా మా ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణమే ఉంటుంది. మా ఆయన రోజూ సినిమాల గురించి మాట్లాడతారు అని తెలిపింది.
Kushi : విజయ్ దేవరకొండ, సమంత సాంగ్ విన్నారా?.. మణిరత్నం సినిమా పేర్లతో సాంగ్.. భలే రాశారే..
ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. నాకు ఖాళీ దొరికాక వచ్చిన ఫస్ట్ కథ ఈ సినిమా. నందిని రెడ్డి నాకు ఈ కథ వినిపించినప్పుడు నచ్చింది. ఇటీవల అన్నీ హిసాత్మక సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. ఈ కథ విన్నాక మంచి సినిమా, మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే ఫ్యామిలీ సినిమా అనిపించి ఓకే చెప్పాను. నాకు సోదరులు లేరు. కానీ తొలిప్రేమలో పవన్ సోదరిగా బాగానే కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు ఈ సినిమాలో కూడా హీరో సంతోష్ శోభన్ కి అక్కగా నటించాను. తమ్ముడికి సపోర్ట్ గా నిలిచే పాత్రలో కనిపిస్తాను. ఇకపై కూడా సినిమాలు చేస్తాను. కాకపోతే ఇలాంటి మంచి పాత్రలు వస్తే కచ్చితంగా సినిమాలు చేస్తాను అని తెలిపారు. దీంతో పవన్ కి సోదరిగా నటించిన వాసుకి ఇన్నేళ్ల తర్వాత సినిమాల్లో నటిస్తుండటంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.