Drishyam 3: ‘దృశ్యం 3’లో మన రాంబాబు కనిపించడు.. రీమేక్ లేదు.. డైరెక్ట్ రిలీజ్

అధికారికంగా 'దృశ్యం 3(Drishyam 3)' మూవీ నుంచి తప్పుకున్న విక్టరీ వెంకటేష్.

Venkatesh Officially Opts Out of Drishyam 3

  • దృశ్యం 3 నుండి వెంకటేష్ అవుట్
  • మే 21న సినిమా విడుదలవుతుంది
  • తెలుగులో మోహన్ లాల్ డబ్బింగ్ వెర్షన్

Drishyam 3: తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘దృశ్యం’. మళయాళ నుంచి రీమేక్ గా వచ్చిన ఈ ఫ్రాంచైజీ తెలుగు ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో రాంబాబుగా వెంకటేష్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం దృశ్యం 3 కోసం తెలుగు ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, దృశ్యం 3కి సంబంధించి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. ‘దృశ్యం 3(Drishyam 3)’ చిత్రంలో విక్టరీ వెంకటేష్ నటించడం లేదని, ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని సమాచారం.

Sreeleela: దయచేసి నన్ను ఆలా పిలవకండి.. నేను అర్హురాలుని కాదు.. శ్రీలీల ఆసక్తికర కామెంట్స్

ఈ మూడవ భాగాన్ని మాత్రం రీమేక్ చేయడం లేదట. దీనికి బదులుగా మోహన్ లాల్ ప్రధాన పాత్రలో మలయాళంలో రూపొందిన అసలు వెర్షన్‌నే నేరుగా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ సినిమా మే 21న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే మలయాళ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో భారీ స్పందన రాబట్టగా, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. తెలుగు వర్షన్‌కు సంబంధించిన ట్రైలర్, ఇతర అప్‌డేట్స్ ఇంకా అధికారికంగా వెలువడనప్పటికీ, అన్ని భాషల్లోనూ ఒకే తేదీన సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

గత రెండు భాగాలు తెలుగులో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో, ఇప్పుడు రాంబాబు కథ ఎలా ముగియబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అందుకే ఈ డబ్బింగ్ వెర్షన్‌కు కూడా టాలీవుడ్‌లో మంచి ఆదరణ లభిస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి తెలుగులో రాంబాబు వెంకటేష్ కాకుండా మోహన్ లాల్ చేయడంపై ప్రేక్షకులు ఎలా తీసుకుంటారు అనేది చూడాలి.