Sreeleela: దయచేసి నన్ను ఆలా పిలవకండి.. నేను అర్హురాలుని కాదు.. శ్రీలీల ఆసక్తికర కామెంట్స్
స్టార్ బ్యూటీ నయనతార గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్రీలీల(Sreeleela).
Sreeleela interesting comments on Nayanthara.
- నయనతారే నిజమైన లేడీ సూపర్ స్టార్
- అపజయం వస్తే గంట మాత్రమే ఏడుస్తా
- విమానం ల్యాండింగ్ అంటే నాకు భయం
Sreeleela: టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల గురించి, ఆమె సినిమాల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అయితే, ఆమె కేరీర్ హిట్ తోనే స్టార్ట్ అయినా, తరువాత మాత్రం ఒడిదుడుకులను ఎదుర్కుంటోంది. అయినా కూడా వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే, వరుసగా ప్లాప్స్ ఎదురవుతున్నా పాజిటివ్ గా ఉండటంపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి స్పందిస్తూ, తనను ‘లేడీ సూపర్ స్టార్’ అని పిలవద్దని కోరింది. ఆ బిరుదుకు కేవలం నయనతార మాత్రమే అర్హురాలని, ఆమె తన రోల్ మోడల్ అని శ్రీలీల(Sreeleela) స్పష్టం చేసింది.
Shakeela: రాధిక కంటే నేనే బాగా చేసేదాన్ని.. ‘తాయ్ కిళవి’ పాత్రపై షకీలా సంచలన వ్యాఖ్యలు!
వైద్య వృత్తిని ఎంచుకుని ప్రజలకు సేవ చేయాలనుకున్న తాను, అనుకోకుండా నటిగా మారానని తన సినీ ప్రయాణం వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. “జీవితంలో జయాపజయాలు సహజం, నాకు అపజయం ఎదురైతే కేవలం ఒక గంట సేపు మాత్రమే బాధపడి ఏడుస్తాను, ఆ తర్వాత వెంటనే తదుపరి పనిలో నిమగ్నమైపోతాను” అని వివరించింది. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, భాషతో సంబంధం లేకుండా మంచి కథలను ఎంచుకుంటానని తెలిపింది. ముఖ్యంగా చెన్నై దోస, అక్కడి వాతావరణం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది.
తన వ్యక్తిగత భయాల గురించి చెబుతూ, విమానం ల్యాండ్ అయ్యే సమయంలో తనకు చాలా భయంగా ఉంటుందని శ్రీలీల వెల్లడించింది. క్షేమంగా భూమిపైకి చేరిన తర్వాత పైలట్, సిబ్బందికి షేక్ హ్యాండ్ ఇచ్చి ధన్యవాదాలు తెలపాలని తన తల్లి నేర్పిన సంస్కారాన్ని తాను ఇప్పటికీ పాటిస్తున్నట్లు పేర్కొంది. నయనతార మాదిరిగానే చెన్నైలో పెళ్లి చేసుకుంటారా అన్న ప్రశ్నకు నవ్వుతూ సమాధానం దాటవేసిన శ్రీలీల వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
