వెంకీమామ మూవీ మేకింగ్ వీడియో లీక్!
విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యతో కలిసి నటిస్తున్న వెంకీమామ మూవీ మేకింగ్ వీడియో లీక్ అయింది.

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యతో కలిసి నటిస్తున్న వెంకీమామ మూవీ మేకింగ్ వీడియో లీక్ అయింది.
మల్టీ స్టారర్ చిత్రాలతో హిట్స్ కొడుతున్న విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ’వెంకీమామ’ అనే మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు. ఫిబ్రవరి 24న ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లింది. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో తొలి షెడ్యూల్ జరుపుకుంటోంది. గోదావరి నది తీరాన వెంకీ, చైతూలపై ఇంట్రడక్షన్ సీన్స్ చిత్రీకరించగా, ఓ వ్యక్తి ఆ సన్నివేశాన్ని ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 26 సెకన్లు గల ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పడవ దిగి వస్తున్న మేనల్లుడిని రిసీవ్ చేసుకున్న వెంకీ ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లడం వంటి సన్నివేశాలని ఆ క్లిప్‌లో చూడొచ్చు.
నిజ జీవితంలోనే కాకుండా చిత్రంలోనూ వెంకటేష్, నాగచైతన్యలు మామ అల్లుళ్ళుగా కనిపించనున్నారు. అయితే మామ రైస్‌మిల్ యజమాని పాత్రలో సందడి చేస్తే, అల్లుడు ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో దగ్గుబాటి రానా కీలక పాత్ర పోషించనున్నాడని టాక్. పక్కా కామెడీ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్, నాగ చౌతన్యకు జోడీగా రాశి ఖన్నా నటిస్తున్నారు. బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్ , సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.