Vennela Kishore turned as Hero announced Chaari 111 Comedy Spy Movie Glimpse Released
Vennela Kishore : వెన్నెల సినిమాలో తన కామెడీతో అందర్నీ మెప్పించి ఆ సినిమానే తన ఇంటిపేరుగా మారేలా స్టార్ కమెడియన్ గా ఎదిగాడు వెన్నెల కిషోర్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నుంచి కమెడియన్ గా మారిపోయిన వెన్నెల కిషోర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కమెడియన్ గా దూసుకుపోతున్నాడు వెన్నెల కిషోర్. ఆ మధ్య డైరెక్టర్ గా కూడా ఓ రెండు సినిమాలు చేశాడు.
ఇప్పుడు హీరోగా మారబోతున్నాడు వెన్నెల కిషోర్. తాజాగా వెన్నెల కిషోర్ హీరోగా చారి 111 అనే సినిమాని అనౌన్స్ చేస్తూ కమెడియన్ సత్య వాయిస్ తో ఓ కామిక్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియోలోనే కథ కూడా చెప్పేశారు. ఒక ఊళ్ళో విలన్ వల్ల సమస్య వస్తే అతన్ని పట్టుకోవడానికి ఓ స్పెషల్ ఆఫీసర్ గా మురళి శర్మ వస్తాడు, ఆ సమస్యని లక్ ఉంది ట్యాలెంట్ లేని హీరో వెన్నెల కిషోర్ ఎలా సాల్వ్ చేశాడు అనేదే కథ. కామెడీ స్పై కథతో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్ గా నటిస్తుంది.
Anasuya : అనసూయ వర్కౌట్స్ చూశారా? ఎంత కష్టపడుతుందో పొద్దున్నే..
కీర్తి కుమార్ దర్శకత్వంలో బర్కత్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. మరి కామెడీ హీరోగా వెన్నెల కిషోర్ ఎలా మెప్పిస్తాడా చూడాలి.