Macherla Niyojakavargam: ఈగో కా బాప్ అంటోన్న గుంతలకడి గురునాధం!

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ నుండి కమెడియన్ వెన్నెల కిషోర్ ‘గుంతలకడి గురునాధం’గా తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమయ్యాడు.

Vennela Kishore Ultimate Look From Macherla Niyojakavargam

Macherla Niyojakavargam: యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి పక్కా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో ఓ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నితిన్ నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Macherla Niyojakavargam: శ్రీకాకుళంలో మాచర్ల మాస్ జాతర!

కాగా ఈ సినిమాలో నితిన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదువే లేదని చిత్ర యూనిట్ చెబుతోంది. అందులో భాగంగా ఈ సినిమాలో కమెడియన్ వెన్నెల కిషోర్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘గుంతలకడి గురునాధం’గా ఈగో ఎక్కువగా ఉండే పాత్రలో వెన్నెల కిషోర్ నవ్వులు పూయించేందుకు రెడీగా ఉన్నట్లుగా ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కనిపించే ప్రతి సీన్ కూడా వినోదభరితంగా తీర్చిదిద్దారట చిత్ర యూనిట్.

Macherla Niyojakavargam: పూనకాలు తెప్పించేలా.. మాచర్లలో నితిన్ ఫస్ట్ అటాక్!

ఈ చిత్రంలో నితిన్ సరసన అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో బ్యూటీ కేథరిన్ త్రేజా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. కాగా హీరోయిన్ అంజలి ఓ స్పెషల్ మాస్ సాంగ్‌లో నటిస్తుంది. ఇప్పటికే ఈ ఐటెం సాంగ్ రిలీజ్ కాగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాను ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.