కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కొత్తలుక్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
తన నటనతో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో జీవించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు.. ప్రస్తుతం ఆయన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంత విరామం తర్వాత మోహన్ బాబు ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా చిరంజీవి ఈ సినిమాలో కనిపించనున్నారట. ఈ సినిమాకు ‘ఆచార్య’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మోహన్‌బాబు ఓ కీలకపాత్రలో కనిపించనున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.
తాజాగా మోహన్‌బాబు కొత్తలుక్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కొత్తలుక్ చిరంజీవి సినిమా కోసమేనని వార్తలు మొదలయ్యాయి. అయితే చిరు, కొరటాల చిత్రంలో మోహన్‌బాబు నటిస్తున్నట్టు ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సుధా కొంగర రూపొందిస్తున్న ‘సూరరై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా) సినిమాలో మోహన్‌బాబు నటిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య నిర్మిస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు అర్జున శక్తివేల్ స్వామి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే ఆయన పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిందని తెలుస్తోంది. త్వరలో విడుదల తేది ప్రకటించనున్నారు.