Bhupinder Singh : ప్రముఖ బాలీవుడ్ సింగర్ భూపిందర్ సింగ్ కన్నుమూత

బాలీవుడ్‌లో అనేక సినిమాలకు తన మధురమైన గానాన్ని అందించిన భూపిందర్ సింగ్ ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Veteran Singer Bhupinder Singh Passes Away In Mumbai (1)

Bhupinder Singh : ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ భూపిందర్ సింగ్ (82) కన్నుమూశారు. బాలీవుడ్‌లో అనేక సినిమాలకు తన మధురమైన గానాన్ని అందించిన భూపిందర్ సింగ్ ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొలాన్ క్యాన్సర్, కొవిడ్ సంబంధ సమస్యలతో భూపేందర్ సింగ్ మరణించారని ఆయన భార్య, గాయని మితాలీ ముఖర్జి తెలిపారు. కొన్ని రోజుల క్రితమే భూపిందర్ సింగ్ ఆస్పత్రిలో చేరినట్టు భార్య మితాలి ముఖర్జీ తెలిపారు.

యూరీన్‌‌లో ఇన్ఫెక్షన్ రావడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్టు చెప్పారు. చికిత్సలో భాగంగా ఆయనకు పలు టెస్టులు చేయగా కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ రోజు రాత్రి 7.45 గంటల ప్రాంతంలో ఆయన మరణించారని ఆమె చెప్పారు. కొలాన్ క్యాన్సర్, కొవిడ్ సమస్యలతోనే భూపిందర్ సింగ్ మరణించాడని భావిస్తున్నారు.

ఐదు దశాబ్దాల పాటు సినీ కెరీర్‌లో భూపిందర్ సింగ్ ఎన్నో సినిమాలకు గాత్రదానం చేశారు. బాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకులతో ఆయన కలిసి పని చేశారు. ఆర్‌డీ బర్మన్, లతతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ, ఆశా భోస్లే, బప్పి లహిరి వంటి ప్రముఖులతో కలిసి పని చేశారు. పంజాబ్‌లో దల్ డూండ్తా హై, నామ్ గమ్ జాయేగా, ఏక్ అకేలా ఇస్ షెహెర్‌ మే, కిసి నజర్ కో తేరా ఇంతెజార్ ఆజ్ భీ హై వంటి ఫేమస్ సాంగ్‌లు పాడారు. భూపేందర్ సింగ్ మరణంతో బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా భూపిందర్ సింగ్ మృతిపట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Read Also : The Warrior: ది వారియర్ 4 రోజుల కలెక్షన్స్.. ఎలా ఉన్నాయంటే?